http://terrafortune.com/news-detail/AP-CM-Chandrababu-naidu-launched-Andhra-Pradesh-Tourism-Policy---Mission/62 AP CM Chandrababu naidu launched Andhra Pradesh Tourism Policy Mission - Terrafortune.com AP CM Chandrababu naidu launched Andhra Pradesh Tourism Policy Mission - Terrafortune.com

AP CM Chandrababu naidu launched Andhra Pradesh Tourism Policy & Mission

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎపి టూరిజం మిషన్‌, పాలసీలను ఆవిష్కరించారు. ఈ నూతన పాలసీకి పారిశ్రామిక వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ప్రభుత్వం ఈ పాలసీలో అనేక రాయితీలను ప్రకటించింది. పర్యాటక మిషన్‌ ప్రారంభించిన తొలి రోజే రాష్ట్ర వ్యాప్తంగా 3,845 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి వివిధ సంస్థలు MOU కుదుర్చుకున్నాయి. మొదటి రోజే రిజిష్ట్రేషన్ల రూపంలో 813 కోట్ల రూపాయల ప్రైవేట్‌ పెట్టుబడులు రావడం గమనర్హం. వీటిలో సాహస క్రీడలకు 218 కోట్లు, హోటళ్ళు, రిసార్టులు నెలకొల్పడానికి 273 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. పరిశ్రమలకు సింగిల్‌ డెస్క్‌ విధానం ద్వారా కేవలం 21 రోజుల్లో అన్ని అనుమతులు జారీ చేస్తామన్నారు. దరఖాస్తులు కూడా ఆన్‌లైన్‌ లో సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు. పర్యాటక రంగంలో 10 వేల కోట్లు పెట్టుబడులు ఆకర్షించడమే తమ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. రిజిష్ట్రేషన్‌ సంస్థల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. బుద్ధ బీచ్‌ రిసార్ట్స్‌, సీవ్యాలీ, పీస్‌ హోటల్స్‌, సాయి విఘ్నేష్ హోటల్స్‌, K.E.I.రాజమహేంద్ర రిసార్ట్స్‌, మినీ హోటల్స్‌, N.S.R.K.రీక్రియేషన్స్‌, త్రివిక్‌ హోటల్స్‌, శ్రీ సాయి హాస్పిటాలిటీ యూనియన్‌ ఈస్ట్‌, ఛాంపియన్‌ యాచ్‌ క్లబ్‌, స్కై చాపర్‌, చంద్ర మెరైన్‌, పున్నమి టూరిజం, క్రసెంట్‌ అడ్వెంచర్స్‌, రైవ్‌ లైన్‌ అడ్వంచర్స్‌, శ్రీ సిటీ ప్రాజెక్ట్స్‌, క్రాఫ్ట్‌ మెన్‌ రియాల్టీ సర్వీసెస్‌, ఫ్రా కౌంట్‌ అడ్వంచర్స్‌, యాక్వాస్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మొదలైనవి ఉన్నాయి.

\r\n

Posted Date: 15-09-2015