http://terrafortune.com/news-detail/CRDA-Decided-to-build-Govt-offices-in-900-acres-for-Amaravathi-capital/96 CRDA Decided to build Govt offices in 900 acres for Amaravathi capital - Terrafortune.com CRDA Decided to build Govt offices in 900 acres for Amaravathi capital - Terrafortune.com

CRDA Decided to build Govt offices in 900 acres for Amaravathi capital

నవ్యాంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలను 900 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని CRDA నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాన్ని 2019-20 నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదించింది. వీటితో పాటు CM, న్యాయ మూర్తులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగుల కొరకు ప్రభుత్వ నివాసాల నిర్మాణం కూడా 2019-20 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. రాజధాని మొదటి దశ నిర్మాణాలకు CRDA రంగాల వారీగా అంచనాలను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కొరకు పంపించింది. అందులో వివరాల ప్రకారం నూతన రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ 67,73,560 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని నిర్ణయించింది. ఒక చ.అడుగు నిర్మాణానికి సుమారు 3500 ఖర్చు ప్రకారం మొత్తం నిర్మాణానికి 2371 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 60 కి.మీ. పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 1700 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. సచివాలయ నిర్మాణం 318 కోట్లతో 9.08 లక్షల చ.అడుగులలో జరుగుతుంది. అసెంబ్లీ, శాసన మండలి నిర్మాణాలకు 115 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. హైకోర్ట్‌ నిర్మాణానికి 202 కోట్లు, శాఖాధిపతుల కార్యాలయాలకు 1670 కోట్లు, రిటైల్‌, రీక్రియేషన్‌ కొరకు 52 కోట్లు, రాజ్‌ భవన్‌ నిర్మాణం కొరకు 14 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.2016 నవంబర్‌ కు నిర్మాణ పనుల కాంట్రాక్ట్‌లను పూర్ర్తి చేయాలని నిర్ణయించింది. 2016 డిశెంబర్‌కు ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణాలకు డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ను సిద్ధం చేయాలని, 2017 డిశెంబర్‌ నాటికి పనుల కాంట్రాక్ట్‌ ను పూర్తి చేయాలని నిర్ణయించింది. 2016-17 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి 355 కోట్లు, 2017-18 లో 830 కోట్లు, 2018-19 లో 830 కోట్లు, 2019-20 లో 356 కోట్లతో పూర్తి స్థాయిలో నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధారించింది.(Source....Sakshi News Paper)

\r\n

Posted Date: 01-02-2016