http://terrafortune.com/news-detail/Indorama-synthetics-to-invest-3-380-crores-in-Andhra-Pradesh/93
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న CII-భాగస్వామ్య సదస్సుకు హాజరైన AP ముఖ్యమంత్రి చంద్రబాబు APలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అనేక కంపెనీలకు ఆహ్వానం పలికారు. ఇండోరమ సింథటిక్స్ కంపెనీ ప్రకాశ్ లోహియాతో భేటీ అయ్యారు. అనుమతులన్నీ వేగంగా ఇస్తామని హామీ ఇచ్చారు. దీనికి సానుకూలంగా స్పందించిన లోహియా APలో 3380 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనితో ఆంధ్రప్రదేశ్ లో మరొక భారీ పరిశ్రమ రాబోతుంది. ఇండోరమ సింథటిక్స్ కంపెనీ పెట్రో కెమికల్ ఉత్పత్తులు, సింథటిక్ ప్లాస్టిక్ బాటిల్స్, సర్జికల్ గ్లోవ్స్ తయారీలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. ప్లాంట్ ఏర్పాటుకు సానుకూల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు మార్చి నెలలో ఒక టీం ను ఆంధ్రప్రదేశ్ కు పంపుతామని లోహియా తెలిపారు. ఈ కంపెనీకి ఇండోనేషియా, ఆఫ్రికాలలో కూడా మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 30 వేల మంది ఉద్యోగులకు ఉపాధిని కల్పిస్తుంది. దావోస్ లో చంద్రబాబు మెకెన్సీ గ్లోబల్ CEO డొమినిక్ బార్టన్ తో కూడా సమావేశమయ్యారు. వీటితో పాటు వైద్య పరికరాల ఉత్పత్తిలో ప్రసిద్ధిగాంచిన మెడ్ ట్రానిక్ కంపెనీ CEO మైఖేల్ కోయిల్, సన్ గ్రూప్ వైస్ చైర్మన్ శివఖేమ్కా, ఫోర్టిస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధిపతి మల్విందర్ సింగ్ లతో కూడా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫైబర్ గ్రిడ్‌కు సహకరించేందుకు సిస్కో కంపెనీ ముందుకొచ్చింది. ఈ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ చాంబర్స్ ను కూడా CM కలిశారు.CII-డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ సదస్సు ముగిసిన తరువాత చంద్రబాబును కలిశారు.టాప్-2 డిజైన్డ్ ఆటో మొబైల్ ఉత్పత్తిదారులను APకి తీసుకురావాలని ఈ సందర్భంగా చంద్రబాబు చంద్రజిత్ బెనర్జీను కోరారు.(Source.. Andhra Jyothi News paper)
\r\n