http://terrafortune.com/news-detail/Lockheed-Martin-to-set-up-manufacturing-plant-in-Andhrapradesh/94 Lockheed Martin to set up manufacturing plant in Andhrapradesh - Terrafortune.com Lockheed Martin to set up manufacturing plant in Andhrapradesh - Terrafortune.com

Lockheed Martin to set up manufacturing plant in Andhrapradesh

రక్షణ రంగ ఆయుధాల ఉత్పత్తిలో అతిపెద్దదైన లాక్‌ హీడ్‌ మార్టిన్‌ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌ లో తయారీ ప్లాంట్‌ నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. సివిల్‌ మరియు మిలిటరీ శాటిలైట్స్‌ తయారీలో లాక్‌ హీడ్‌ మార్టిన్‌ అగ్రగామి సంస్థ.AP CM చంద్రబాబు లాక్‌ హీడ్‌ కంపెనీ CEO మార్లిన్‌ హ్యాసన్‌ తో భేటీ అయ్యారు. AP లో రక్షణ పరికరాల తయారీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలు, వాటి ప్రత్యేకతలను చంద్రబాబు హ్యాసన్‌ కు వివరించారు.హ్యాసన్‌ టెక్సాస్‌ లో ఉన్న తమ ఉత్పత్తి యూనిట్స్‌ లో కొన్నిటిని ఇండియాకు తరలించాలని భావిస్తున్నామని తెలిపారు. లాక్‌ హీడ్‌ కంపెనీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ లు, ఫైజర్‌ జెట్ల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. రక్షణ రంగ ఉత్పత్తులకు, విమానయాన రంగానికి ఆంధ్రప్రదేశ్‌ ను గమ్యస్థానం చేయుటకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఎయిర్‌ బస్‌ CEO తో కూడా సమావేశమయ్యారు. రక్షణ, అంతరిక్ష, పరిశోధన రంగాలలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనుకూలంగా ఉంటుందని వివరించారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే అనంతపురం జిల్లాలో విమానయాన రంగ అభివృద్ధి కొరకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. వీటితో పాటు APలో ప్లాంట్‌ ఏర్పాటు చేయుటకు వెల్స్‌ పన్‌ గ్రూప్‌ చైర్మన్‌ గొయెంకా ముందుకొచ్చారు.APలో వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అధ్భుతమైన వృద్ధి రేటుతో దూసుకుపోతుందని, పెట్టుబడులకు అన్ని విధాలుగా సానుకూల అంశాలు కలిగి ఉందని, అందరూ పెట్టుబడులు పెట్టడానికి మందుకు రావాలని చంద్రబాబు ఆహ్వానించారు.(Source....Andhra Jyothi News paper)

\r\n

Posted Date: 28-01-2016