http://terrafortune.com/news-detail/Vizag---Kakinada-to-be-developed-as-Smart-cities-in-first-20-smart-cities-list/95 Vizag Kakinada to be developed as Smart cities in first 20 smart cities list - Terrafortune.com Vizag Kakinada to be developed as Smart cities in first 20 smart cities list - Terrafortune.com

Vizag & Kakinada to be developed as Smart cities in first 20 smart cities list

కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌ సిటీ పథకంలో భాగంగా తొలి విడతలో దేశవ్యాప్తంగా 20 నగరాలను ఎంపిక చేశారు. కేంద్ర్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఈ స్మార్ట్‌ సిటీల జాబితాను విడుదల చేశారు. దీని కొరకు దేశ వ్యాప్తంగా 100 నగరాలు పోటీపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌ నుండి కాకినాడ, విశాఖపట్నం స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చెందబోతున్నాయి. ఈ రెండు నగరాల అభివృద్ధి కొరకు రాబోయే 5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి 1000 కోట్ల నిధులు అందనున్నాయి. స్మార్ట్‌ సిటీ చాలెంజ్‌ లో వైజాగ్‌ 8వ స్థానం, కాకినాడ 14 వ స్థానం, తిరుపతి 42వ స్థానంలో ఉన్నాయి. వీటితో పాటు మెరుగైన ప్రణాళికలు సమర్పించిన మరో 23 నగరాలను స్మార్ట్‌ సిటీల పథకం కిందకు చేరుస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు. దీంతో తిరుపతి కూడా ఈ సంవత్సరం నుండే స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్మార్ట్‌ సిటీలుగా ఎంపికైన నగరాలలో ప్రణాళికలు అమలుపరచుటకు, నిధుల సేకరణ, వినియోగం కొరకు AP స్మార్ట్‌ సిటీ ఫౌండేషన్‌ ను ఏర్పాటు చేశారు. స్మార్ట్‌ సిటీ అభివృద్ధి గురించి చర్చించుటకు ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడలో ఒక కీలక సమావేశం నిర్వహించనున్నారు. 1650 ఎకరాలలో 1742 కోట్లతో విశాఖపట్నం స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దబడుతుంది. ఇందులో గ్రీన్‌ ఫీల్డ్‌ స్మార్ట్‌ సిటీ నిర్మాణం జరుగుతుంది. దీని కొరకు RK  బీచ్‌ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. వైజాగ్‌ ను వాణిజ్య రాజధానిగా, పోర్ట్‌ ఆధారిత నగరంగా, పారిశ్రామిక హబ్‌ గా మరింత వేగంగా అభివృద్ధి చేయబోతున్నారు. విదేశీ సంస్థలు విశాఖలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుంది. కోస్తా తీరంలో వేగంగా అభివృద్ధి చెందుతూ ఆర్ధికంగా ప్రభావవంతమైన నగరంగా కాకినాడను తీర్చిదిద్దాలని స్మార్ట్‌ సిటీ లక్ష్యంగా నిర్దేశించారు. ఈ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం 1993 కోట్లు. దీనితో నగరంలో అనేక రకాల అభివృద్ధి కార్యకమాలను చేపడతారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, బోట్‌ బిల్డింగ్‌ యార్డ్‌, ఫిష్ ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌ యూనిట్‌, కోల్డ్‌ స్టోరేజ్‌, స్థానిక మార్కెట్‌ లను ఏర్పాటు చేస్తారు. కాకినాడ భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారుతుంది. ఈ విధంగా స్మార్ట్‌ సిటీలుగా ఎంపికైన నగరాలను అన్ని రకాల అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతారు.(Source....Sakshi & Eenadu News paper)

\r\n

Posted Date: 29-01-2016