2371 crores budget for construction of govt buildings in Amaravathi capital

AP రాజధాని అమరావతిలో ప్రభుత్వ విభాగాల నిర్మాణం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగబోతుంది. స్విస్‌  ఛాలెంజ్‌ పద్ధతిలో ఈ భవన నిర్మాణాలు చేపట్టడానికి సింగపూర్‌ కంపెనీలు నిరాకరించాయి. ప్రభుత్వ భవనాల సముదాయంలో అసెంబ్లీ, శాసనమండలి, హైకోర్ట్‌, సచివాలయం, ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు, వినోద, ఆహ్లాద కేంద్రాలు, రాజ్‌ భవన్‌ ఇవన్నీ ఉంటాయి. వీటి నిర్మాణం పూర్తి చేయుటకు 2020 నాటికి 2371 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ భవనాలన్నీ దాదాపు 67.73 లక్షల చ.అడుగుల నిర్మిత స్థలంలో నిర్మించబడుతున్నాయి. భవనాల నిర్మాణం పూర్తి చేసి వినియోగానికి వీలుగా ప్లగ్‌ & ప్లే సౌకర్యాలు కల్పించుటకు ప్రస్థుత ధరల ప్రకారం ఒక చ.అడుగుకు 3500 రూ. ఖర్చు అవుతుంది. ఈ లెక్క ప్రకారం మొత్తం 67.73 లక్షల చ.అ.ల విస్తీర్ణానికి 2371 కోట్లు అవుతుందని అంచనా. ఈ భవనాల ఆర్కిటెక్చర్‌ కోసం ప్రభుత్వం ప్రపంచ అగ్రశ్రేణి సంస్థల ప్రణాళికలను పరిశీలిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయి ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ తయారీ బాధ్యతను త్వరలో సలహా సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తుంది. నవంబరు నాటిని బిల్డర్‌ లకు పనుల బాధ్యతలు అప్పగిస్తారు. ప్రతి సంవత్సరం కొన్ని నిధులను కేటాయిస్తూ 2020 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. మొత్తం 67.73 చ.అ.ల విస్తీర్ణంలో అసెంబ్లీ, శాసన మండలి 3.23 లక్షల చ.అడుగులు, హైకోర్టు 5.77 లక్షల చ.అడుగులు, సచివాలయం 9.08 లక్షల చ.అడుగులు, విభాగాధిపతుల కార్యాలయాలు 47.74 లక్షల చ.అడుగులు, వినోద, ఆహ్లాద కేంద్రాలు 1.5 లక్షల చ.అడుగులు, రాజ్‌ భవన్‌ 40,000 చ.అడుగులలో నిర్మితమవుతాయి.

\r\n

Posted Date: 09-02-2016