Andhrapradesh ranked 2nd best place for buisiness investments in india

ప్రపంచ బ్యాంక్‌ నివేదిక ప్రకారం దేశంలో వ్యాపారం చేయడానికి పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో గుజరాత్‌ రాష్ట్రం ఉండగా ఆంధ్రప్రదేశ్‌ రెండవ స్థానంలో ఉంది. తెలంగాణా రాష్ట్రం 13వ స్థానంలో ఉంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలపై సమగ్ర సర్వేను నిర్వహించాలని ప్రధాని మోదీ భావించారు. ఈ సర్వే బాధ్యతలను ప్రపంచ బ్యాంకుకు అప్పగించారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌, కేపియంజి సిఐఐ, ఫిక్కీలతో కలిసి రాష్ట్రాల్లో వ్యాపార సంస్కరణల అమలుపై అంచనా పేరిట రూపొందించిన నివేదికను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. ఈ సర్వేలో ప్రపంచ బ్యాంకు సరళీకృత విధానాల్లో అనుమతులు మంజూరు చేస్తూ పారిశ్రమిక ప్రోత్సాహకాలను ఇవ్వడాన్ని ప్రధానంగా తీసుకుంది. సింగిల్‌ డెస్క్‌ విధానం, ఆన్‌లైన్‌ విధానం, పారిశ్రామిక సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. గుజరాత్‌కు ధీటుగా ఆంధ్రప్రదేశ్‌ నిలవడం దేశ,విదేశాల పారిశ్రామిక దిగ్గజాలు నవ్యాంధ్రప్రదేశ్‌పై ఆసక్తి చూపేలా చేస్తున్నాయి. దరఖాస్థు చేసుకున్న 21 రోజుల్లో పరశ్రమల ఏర్పాటుకు అనుమతులు జారీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు చేసిన సింగిల్‌ డెస్క్‌ విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రపంచ బ్యాంకు కూడా దీనిని అభినందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల పురోగతిని తెలుసుకోవడానికి డాష్ బోర్డు పేరుతో ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమైన దస్తావేజులను పరిశీలించి వెంటనే రిజిష్ట్రేషన్లకు అనుమతులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పది అంశాల్లో తన పనితీరు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. భూముల కేటాయింపు, నిర్మాణ అనుమతుల మంజూరు, పర్యావరణ, కార్మిక చట్టాలు, మౌలిక సదుపాయాల లభ్యత, పన్నుల రిజిష్ట్రేషన్‌, వసూళ్ళు, తనిఖీల నిర్వహణ విభాగాల్లో జాతీయ సగటు కంటే, మిగిలిన రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉంది. పెట్టుబడుల అనుకూల రాష్ట్రాల ర్యాంకింగ్‌ లో త్వరలోనే మొదటి స్థానంలో ఉంటామని చంద్రబాబు ధీమా వ్యక్తపరిచారు.

\r\n

Posted Date: 16-09-2015