Huge IT Investments in Visakhapatnam, Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అన్ని రంగాల కన్నా మిన్నగా IT రంగాన్ని అభివృద్ధి చేయాలని AP ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 44  కంపెనీల ఏర్పాటుకు అనుమతులు కూడా ఇవ్వబడ్డాయి.5000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. IT కంపెనీలు తమ సంస్థలను వైజాగ్‌ లో ఏర్పాటు చేయుట ఆసక్తి చూపుతున్నారు.సంస్థల ఏర్పాటు కొరకు ఖాళీ స్థలం కంటే ఆఫీస్‌ స్థలాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.దీని ప్రకారం తగిన మౌలిక వసతులను కల్పించుట కొరకు ప్రభుత్వం కృషి చేస్తుంది. అయితే, ఎన్ని సంస్థలు వచ్చినా అవసరమైనంత ఆఫీస్‌ స్థలాలను కేటాయించుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని IT శాఖ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి వివరించారు. ఇందులో భాగంగానే వైజాగ్‌ లో గీతం యూనివర్సిటీలో IT సంస్థల కొరకు ప్లగ్‌ & ప్లే ఆఫీసులను కేటాయిస్తామన్నారు. IT కంపెనీలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించుట కొరకు వైజాగ్‌లో 20 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో సిగ్నేచర్‌ టవర్‌ ను నిర్మిస్తున్నారు.దీనితో పాటు 4 ఎకరాల స్థలంలో 3 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో మిలీనియం టవర్‌ ను కూడా నిర్మించబోతున్నారు. దీని కొరకు 190 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. విశాఖలో ఇప్పటికే 1.5 లక్షల చ.అడుగులలో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఉంది. ఇందులో విప్రో, టెక్‌ మహీంద్ర వంటి ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. విశాఖతో పాటు   AP లోని ఇతర ప్రాంతాలలో కూడా అనేక సంస్థలు వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. మిచిగాన్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సంస్థ విశాఖలో 8 కోట్ల పెట్టుబడితో ఫ్యాబ్‌ లాబ్‌ ను ఏర్పాటు చేయబోతుంది. తిరుపతిలో సెల్‌కాన్‌, మైక్రోమాక్స్‌, కార్బన్‌ మొబైల్‌ కంపెనీలు తమ యూనిట్స్‌ను స్థాపించుటకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. శ్రీసిటీలో జపాన్‌ కంపెనీ ఫెడ్‌ కాన్‌ కార్యకలాపాలను ప్రారంభించింది. అనంతపురం జిల్లాలో 2000 కోట్ల పెట్టుబడితో రాగమయూరి ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.IT రంగం పనితీరు, ప్రగతిని వివరించుటకు ఒక వెబ్‌ జర్నల్‌ కూడా రాబోతుంది. వీటిపై సలహాలు, సంప్రదింపుల కొరకు ఒక కాల్‌ సెంటర్‌ కూడా ఏర్పాటవుతుంది.(Source....Eenadu News Paper)

\r\n

Posted Date: 03-02-2016