Japan company Toshiba investments in Telangana

జపాన్‌కు చెందిన తోషిబా కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థ అయిన తోషిబా ట్రాన్స్‌మిషన్‌ & డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌ ఇండియా (TTDI) 2013 డిశెంబర్‌లో తెలంగాణాలోని మెదక్‌ జిల్లా, రుద్రారంలో ఉన్న విజయ్‌ ఎలక్ట్రికల్స్‌కు చెందిన పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌, పంపిణీ ట్రాన్స్‌ ఫార్మర్స్, స్విచ్‌ గేర్ల బిజినెస్‌ ను కొనుగోలు చేసింది. గ్యాస్‌ ఇన్సులేటర్స్‌, సాలిడ్‌ ఇన్సులేటెడ్‌, స్విచ్‌ గేర్ల తయారీ యూనిట్‌ను ఇక్కడ ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ యూనిట్‌ కొరకు 200 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తాజాగా ఈ యూనిట్‌ను మరో 200 కోట్ల పెట్టుబడితో విస్తరిస్తామని TTDI చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కుత్సుతోషి తోడా తెలిపారు. ప్రస్థుతం తాము ఈ యూనిట్‌ లో తయారు చేస్తున్న ట్రాన్స్‌ఫార్మర్స్‌ లో 50% ఎగుమతి చేస్తున్నామని, కానీ స్విచ్‌ గేర్లను దేశీయ వినియోగానికి సరిపోయేంత మాత్రమే తయారుచేస్తున్నామని తెలిపారు.ఈ తయారీని కూడా గణనీయంగా పెంచి ఎగుమతి మార్కెట్‌ ను విస్తరిస్తామని తెలిపారు. భారత్‌ లో భవిష్యత్‌ అవసరాలకు, ఆసియా, పసిఫిక్‌ మార్కెట్‌ లను దృష్టిలో ఉంచుకుని రుద్రారం యూనిట్‌ ను ఎగుమతులకు గ్లోబల్‌ హబ్‌ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ రెండు సంవత్సరాలలో ఉద్యోగుల సంఖ్య 4500 నుండి 6000కు పెరిగిందని, నూతన పెట్టుబడులతో 2017 నాటికి మరో 1000 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తామని వివరించారు. మేక్‌ ఇన్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ తెలంగాణా రెండింటికీ ఈ యూనిట్‌ విస్తరణ దోహదపడుతుందని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టే ఉద్దేశ్యం తమకు లేదని, ఈ యూనిట్‌ లోనే పెట్టుబడులు పెడతామని, భవిష్యత్‌ విస్తరణకు కూడా అవసరం అయినంత స్థలం ఇక్కడే అందుబాటులో ఉందని తెలిపారు.(source....Eenadu & Andhra jyothi News paper)

\r\n

Posted Date: 05-02-2016