MOUs for Huge investments in AP through partnership summit-2016 in Vizag

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వైజాగ్‌లో 3 రోజులపాటు నిర్వహించబడుతున్న భాగస్వా మ్య సదస్సులో భారీ స్థాయిలో పెట్టుబడులకు ఒప్పందాలు జరుగుతున్నాయి. మొదటి రోజు మొత్తం 1,95,457 కోట్ల పెట్టుబడులకు 32 MOUలపై AP  ప్రభుత్వం సంతకాలు చేసింది. వీటితో పాటు IT రంగంలో 49 ఒప్పందాలు కుదరబోతున్నాయని AP CM చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుండి 1450 మంది ప్రతినిధులు హాజరయ్యారు. విశాఖకు 70 KMల దూరంలో ఉన్న రాంబిల్లి వద్ద నౌకా నిర్మాణ కేంద్రాన్ని నిర్మించుటకు Reliance ADAG సంస్థ ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనికి ఎన్నో అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందనున్నాయి. ఈ పెట్టుబడుల విలువ సుమారు 10,000 కోట్ల వరకు ఉంటుంది. కృష్ణా జిల్లాలో 5280 మెగా వాట్ల ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు కొరకు ఒప్పందం కుదిరింది. కర్నూలు జిల్లాలో గోల్డ్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌ కొరకు 3,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి జియో మైసూర్‌ సర్వీసెస్‌ సిద్ధంగా ఉంది. పెట్టుబడులలో కొన్ని ముఖ్యమైనవి ఆస్ట్రేలియాలోని క్వీన్‌ లాండ్‌ కోల్‌ కార్పొరేషన్‌ 31,680 కోట్లు, Reliance ADAG సంస్థ 5000 కోట్లు, అశోక్‌ లేలాండ్‌ 1000 కోట్లు, భారత్‌ ఫోర్జ్‌ 1400 కోట్లు, దివీస్‌ లాబ్స్‌ 1250 కోట్లు. ఈ ఒప్పందాలు అన్నీ కార్యరూపం దాల్చితే సుమారు 95 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొదటి రోజు ఎక్కువగా ఇంధన, పరిశ్రమల, గనుల రంగాలకు సంబంధించిన ప్రాజెక్ట్‌లపై ఒప్పందాలు జరిగాయి. దేశంలో ప్రస్థుతం వ్యాపారానుకూలత, పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్‌ మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ఇదే విధంగా ముందుకు కొనసాగితే భవిష్యత్తులో ఆ స్థానాన్ని AP  దక్కించుకుంటుందని ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం వలన రియల్‌ ఎస్టేట్‌ రంగంపై కూడా దీని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రియల్‌ భూమ్ ను పెంచడానికి దోహదపడుతుందని నిపుణులు ఆశిస్తున్నారు. (Source.. Eenadu & Andhra Jyothi News paper) 

\r\n

Posted Date: 11-01-2016