UK Government to setup International Hospital in Amaravathi with 1000 Crores

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతిలో వెయ్యి కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హాస్పిటల్‌ ను నిర్మించబోతున్నారు. హాస్పిటల్‌ కు అనుబంధంగా మెడికల్‌ కాలేజీలు, వైద్య సంబంధ పరిశోధన, శిక్షణ సంస్థలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇండియా-యుకె సంయుక్త సంస్థ అయిన ఇండో యుకె ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా అన్ని విభాగాలతో కూడిన హెల్త్‌ కేర్‌ సిటీ కొరకు ఈ జూన్‌ లోపు శంకుస్థాపన చేసి వచ్చే 3 సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్‌ ను పూర్తి చేస్తారు. దీని కొరకు రాష్ట్ర ప్రభుత్వం, ఇండో యుకె ఇన్స్‌స్టిట్యూట్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై AP ఆర్ధికాభివృద్ధి మండలి  క్రిష్ణ కిశోర్‌, ఇండో యుకె హెల్త్‌ ఇన్స్‌ స్టిట్యూట్‌ MD అజయ్‌ రంజన్‌ సంతకాలు చేశారు. గత సంవత్సరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్‌ పర్యటనలో ఇండో-యుకె సంస్థ ఆధ్వర్యంలో ఇండియాలో 13,555 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 11 హాస్పిటల్స్‌ ఏర్పాటు చేయుటకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగానే మొట్టమొదటి హాస్పిటల్‌ ను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచే దేశంలో ఇతర కార్యకలాపాలు నిర్వహించనున్నారు. దీని నిర్మాణం కొరకు అమరావతి ప్రాంతంలో 100 ఎకరాల స్థలం కేటాయించాలని బ్రిటన్‌ సంస్థ చంద్రబాబు ను కోరింది. చంద్రబాబు త్వరలోనే పరిశీలిస్తామన్నారు. తొలి దశలో 250 పడకలతో 6 నెలల్లో ప్రాజెక్ట్‌ ను ప్రారంభించబోతున్నారు. తరువాత 1000 పడకలకు విస్తరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ ను వైద్య, ఆరోగ్య రంగంలో ప్రపంచ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే వైద్య రంగంలో అమరావతిలో 1600 కోట్లతో   AIIMS ఏర్పాటవుతుందని తెలిపారు. దుబాయికి చెందిన షెట్టి గ్రూప్‌ మరొక భారీ హాస్పిటల్‌ ను నెలకొల్పడానికి ముందుకొచ్చిందన్నారు.(source....Sakshi & Eenadu News paper)

\r\n

Posted Date: 06-02-2016