https://terrafortune.com:443/news-detail/17,000-crores-investments-in-Andhra-Pradesh-by-china-companies/68 17,000 crores investments in Andhra Pradesh by china companies - Terrafortune.com 17,000 crores investments in Andhra Pradesh by china companies - Terrafortune.com

17,000 crores investments in Andhra Pradesh by china companies

ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చేసిన చైనా పర్యటన విజయవంతం అయింది. దీనికి ఫలితంగానే ఒకేరోజు అనేక   ఒప్పందాలు జరిగాయి. మొత్తం 17 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. చైనాకు చెందిన జియాన్‌ లోంగీ సిలికాన్‌ మెటీరియల్స్‌ కార్పొరేషన్‌ సంస్థ 8 వేల కోట్ల పెట్టుబడి పెట్టి చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో పరిశ్రమలను స్థాపించడానికి సిద్ధం అయింది. 1000 మెగా వాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్‌ సెల్స్‌, 1000 మెగావాట్ల సోలార్‌ మాడ్యూల్స్‌ను ఉత్పత్తి చేయబోతుంది. దీనితో పాటు మరో 500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి రాష్ట్రానికి విక్రయిస్తుంది. ఢిల్లీలోని తాజ్‌ మాక్సింగ్‌ హోటల్‌ లో ఏపీజెన్‌కో-లోంగీ, శ్రీసిటీ-లోంగి, ఏపీజెన్‌కో-ఆర్‌ఈసీ, ఏపీట్రాన్స్‌కో-ఆర్‌ఈసీల మధ్య 4 వేర్వేరు ఒప్పందాలు జరిగాయి. ఈ సమావేశంలో చైనా మంత్రి లియూ జిన్‌ సాంగ్‌, లోంగీ సంస్థ చైర్మన్‌ బావోషెన్‌ ఝెంగ్‌లు ప్రసంగించారు. భారత్‌ లో పెట్టుబడులు పెట్టడానికి తాము సుముఖంగా ఉన్నామని తెలిపారు. శ్రీసిటీలో మొదటి విడతగా 1670 కోట్ల పెట్టుబడి పెడతామని, దీని ద్వారా 5 వేల మందికి ఉపాధి కల్పిస్తామని వివరించారు. ఎరువుల ఉత్పత్తి సంస్థ అయిన క్రిషక్‌ భారతి కో-ఆపరేషన్‌ లిమిటెడ్‌ (క్రిభ్కో) కృష్ణపట్నంలో భాస్వరం,పొటాష్ ఎరువుల ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 1000 కోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటించింది. దీని కొరకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కూడా కేటాయించింది. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10 సంవత్సరాల పాటు విద్యుత్‌ రాయితీ, 7 సంవత్సరాల పాటు VAT మినహాయింపు వంటి ఆఫర్లు తాము ప్లాంట్‌ నెలకొల్పడానికి నిర్ణయం తీసుకునేలా చేశాయని తెలిపింది. ఈ రాయితీల వలన వారికి 500 కోట్ల వరకు ప్రయోజనం లభిస్తుందని వివరించింది.  

\r\n

Posted Date: 25-09-2015