https://terrafortune.com:443/news-detail/2800-crores-investments-in-Andhra-Pradesh/78 2800 crores investments in Andhra Pradesh - Terrafortune.com 2800 crores investments in Andhra Pradesh - Terrafortune.com

2800 crores investments in Andhra Pradesh

నవ్యాంధ్రప్రదేశ్‌లో 2800 కోట్ల పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో రాష్ట్ర పెటుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. గుంటూరులోని తిమ్మాపురంలో 159 కోట్లతో వసంత ఇండస్ట్రీస్‌ పేరుతో కాటన్‌ స్పిన్నింగ్‌ మిల్‌ విస్తరణకు అనుమతులు మంజూరయ్యాయి. నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేటలో 337 కోట్లతో తారకేశ్వర టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్లాంట్‌ నిర్మిస్తుంది. విశాఖపట్నంలో టెక్స్‌పపోర్ట్‌ ఇండస్ట్రీస్‌ ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌ 101 కోట్లతో నిట్టింగ్‌ మిల్‌, గార్మెంట్‌ ప్రాజెక్ట్‌ నిర్మిస్తుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో 145 కోట్లతో బ్రిటానియా బిస్కెట్ల తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది. సర్వేపల్లి, కృష్ణ పట్నం సమీపంలో 1500 కోట్లతో క్రిబ్‌ కో ప్రాజెక్ట్‌ రాబోతుంది. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో 585 కోట్లతో సాఫ్ట్‌ డ్రింక్‌ క్యాన్ల పరిశ్రమ, రెగ్జాం HTW  క్యాన్ల పరిశ్రమకు విద్యుత్‌, మౌలిక సదుపాయల కొరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నూతన పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా దాదాపు 22 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. తిరుపతిలో శంకుస్థాపన జరిగిన సెల్‌ కాన్‌, మైక్రోమాక్స్‌, కార్బన్‌, లావా ఇన్‌టర్నేషనల్‌ కంపెనీలకు బోర్డు ఆమోదం లభించింది. సోలార్‌ పానల్స్‌ తయారీ పరిశ్రమలైన లాంగీ సోలార్‌ ట్రైనా, జేసోలార్‌ పరిశ్రమలకు కూడా అనుమతులు మంజూరయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ VEM టెక్నాలజీకు కూడా అనుమతులు జారీ చేశారు. గుంటూరు, విశాఖ, కర్నూలు, అనంతపురం కేంద్రంగా పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని చంద్రబాబు అదేశించారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని కోరారు. శిక్షణ పొందే చోటే వారు ఉండేలా భవష్యత్తులో టౌన్‌ షిప్‌ లు నిర్మిస్తామని తెలిపారు.

\r\n

Posted Date: 18-11-2015