https://terrafortune.com:443/news-detail/314-km-Road-grid-for-Amaravathi-capital/73 314 km Road grid for Amaravathi capital - Terrafortune.com 314 km Road grid for Amaravathi capital - Terrafortune.com

314 km Road grid for Amaravathi capital

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతన రాజధానిలో రోడ్‌ గ్రిడ్‌ ను ఖరారు చేసింది. రాజధాని నిర్మాణం జరగబోతున్న 29 గ్రామాలను కలుపుతూ 314 కి.మీ. మేర ఈ రోడ్‌ గ్రిడ్‌ ను రూపొందించారు. సింగపూర్‌ ప్రభుత్వ కంపెనీలు మాస్టర్‌ ప్లాన్‌ లో ఇచ్చిన రోడ్‌ గ్రిడ్‌ కు కొన్ని మార్పులు చేసి ఈ నూతన రోడ్‌ గ్రిడ్‌ నెట్‌ వర్క్‌ ను డిజైన్‌ చేశారు. ఆధునిక నగరాల నిర్మాణంలో రోడ్లన్నీ సమాంతరంగా ఉండేలా ఒక చోట నుండి మరో చోటుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళేలా రోడ్లను అనుసంధనిస్తూ ఈ రోడ్‌ నెట్‌ వర్క్‌ ను తయారుచేశారు. చండీగడ్‌, గాంధీనగర్‌ లలో రోడ్‌ నెట్‌ వర్క్‌ లను ఇదే విధంగా ఏర్పాటు చేశారు. ఇండియాలో ఖచ్చితమైన రోడ్‌ గ్రిడ్‌ ఉన్న నగరం చండీగడ్‌, అదే విధంగా అంతర్జాతీయంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటుంవంటి రోడ్‌ గ్రిడ్‌ ఉంది. వీటిని అధ్యయనం చేసి సింగపూర్‌ ఇచ్చిన మాస్టర్‌ ప్లాన్‌ కు అనుగుణంగా నూతన రాజధాని రోడ్‌ గ్రిడ్‌ ను రూపొందించడం జరిగింది. ఇందులో 217 చ.కి.మీ.ల మేర 144 బ్లాకులు ఉంటాయి. అన్ని రోడ్లు చతురస్ర, దీర్ఘచతురస్రాకార బ్లాకులుగా ఉంటాయి. డిజైన్‌ ప్రకారం ఒకదానికొకటి నిర్ధిష్ట దూరంలో అనుసంధానమై ఉంటాయి. ఒక చ.కి.మీ.పరిధిలో బ్లాకును ఏర్పాటు చెస్తే ఒక కి.మీ. దూరం ఎటు వెళ్ళినా బ్లాకులోనే ఉంటుంది. ఈ విధంగా అన్ని రోడ్లు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. మొత్తం 144 బ్లాకులు, ఇందులో 1 కి.మీ. బ్లాకులు 121, 1-2 కి.మీ. బ్లాకులు 8, రాజధాని చుట్టూ 15 బ్లాకులను ఏర్పాటు చేస్తున్నారు. 217 చ.కి.మీ.ల రాజధాని నగరంలో 314 కి.మీ. మేర మొత్తం ఈ బ్లాకుల్లోనే ఉంటుంది. 146 కి.మీ. మేర 130 అడుగుల వెడల్పు రోడ్లు, 104 కి.మీ. మేర 165 అడుగుల వెడల్పు రోడ్లు, 64 కి.మీ. మేర 200 అడుగుల వెడల్పు రోడ్లు ఉంటాయి. ఈ బ్లాకుల్లోనే 80,60,40 అడుగుల వెడల్పు గల అంతర్గత రోడ్లు కూడా ఉంటాయి. ఇక్కడున్న గ్రామాలను ఏమాత్రం కదిలించకుండా ఈ రోడ్‌ గ్రిడ్‌ నెట్‌వర్క్‌ ను తయారుచేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

\r\n

Posted Date: 05-10-2015