https://terrafortune.com:443/news-detail/AP-CM-Chandrababu-Naidu-special-focus-on-Tourism-projects/35 AP CM Chandrababu Naidu special focus on Tourism projects - Terrafortune.com AP CM Chandrababu Naidu special focus on Tourism projects - Terrafortune.com

AP CM Chandrababu Naidu special focus on Tourism projects

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టూరిజం ప్రాజెక్ట్‌లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దీని ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆశిస్తున్నారు. ప్రస్థుతం నిధులు కొరతతో ఉన్న రాష్ట్రంలో 14% ఆదాయం పర్యాటక రంగం నుంచే వస్తుందని, దీనిని 18%కు పెంచాలని భావిస్తున్నారు. దీని కొరకు అనేక సరికొత్త ఆకర్షణీయమైన పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ యొక్క 1000 కి.మీ. పొడవైన తీరప్రాంతంలో బీచ్‌ రిసార్ట్‌లు, పార్కులు, పిక్నిక్‌ ప్రదేశాలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిని బౌద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పర్యాటక అధికారులను ఆదేశించారు. ఒక కాలచక్ర ఆలయాన్ని కూడా నిర్మించాలని సూచించారు.100 కోట్లతో ప్రారంభిస్తున్న కాకినాడ-కోనసీమ వలయం, 90 కోట్ల నెల్లూరు తీరప్రాంత వలయం, 60 కోట్ల అమరావతి బౌద్ధ ప్రాజెక్ట్‌ పనులను సమీక్షించారు. విశాఖ, తిరుపతిలో రాత్రి సందర్శన కేంద్రాలు, కుప్పంలో ఎలిఫెంట్‌ సఫారీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు సాహస, జల క్రీడలకు సంబంధించి వచ్చే 3నెలలలో వివిధ రకాల ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తామని తెలిపారు. విశాఖ, నెల్లూరు, గుంటూరు, విజయవాడలలోని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేశామని అక్కడ స్టార్‌ హోటళ్ళ ఏర్పాటుకు ఒబెరాయ్‌, ఐటిసీ, నోవాటెల్‌ తదితర గ్రూపు సంస్థలతో చర్చించామని తెలిపారు. ఉభయగోదావరి జిల్లాలను ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని వివరించారు.సముద్రతీరంలో ఉన్న 500 ద్వీపాల్లో పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయుటకు ముందుకు వచ్చిన వారికి వేగంగా అనుమతులు ఇవ్వలని సలహా ఇచ్చారు.

\r\n

Posted Date: 30-07-2015