https://terrafortune.com:443/news-detail/AP-CRDA-Region-to-become-as-Free-Zone/50 AP CRDA Region to become as Free Zone - Terrafortune.com AP CRDA Region to become as Free Zone - Terrafortune.com

AP CRDA Region to become as Free Zone

ఆంధ్రప్రదేశ్‌ CRDA పరిధిని ఫ్రీజోన్‌ గా చేయాలని పోలీసు విభాగం కసరత్తు చేస్తుంది. CRDA పరిధి కృష్ణా, గుంటూరు రెవెన్యూ జిల్లాల్లో విస్తరించి ఉంది. పోలీస్‌ పరిపాలన ప్రకారం చూస్తే CRDA లోని కొంత భాగం ఏలూరు పరిధిలో, మరికొంత భాగం గుంటూరు పరిధిలో ఉంది. పోలీస్‌ రిక్రూట్‌మెంట్స్‌ లో 13 జిల్లాలకు చెందిన వారికి సమప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ చర్య తీసుకుంటున్నారు. డిజిపి జాస్తి వెంకట రాముడు ఉన్నతాధికారులతో ఫ్రీ జోన్‌ అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్‌ శాఖకు సంబంధించి జోనల్‌ స్థాయి నియామకాల్లో ఆ జోన్‌ పరిధిలోకి వచ్చే జిల్లాల వారికి 70%, ఇతర జోన్ల వారికి 30% కోటా ఉంటుంది. రాష్ట్ర స్థాయి పోస్టులకు అయితే అన్ని జిల్లాల వారికి సమప్రాధాన్యం ఉంటుంది. CRDA పరిధిని ఫ్రీజోన్‌ చేయకపోతే రాజధానితోపాటు, CRDA పరిధిలోని ఉద్యోగాలకు కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాల వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ లోని పోలీస్‌ కమీషనరేట్‌ సైతం చాలా కాలం పాటు ఫ్రీజోన్‌ గా కొనసాగింది. ఈ నేపధ్యంలోనే అన్ని ప్రాంతాల వారు అక్కడ పోలీస్‌ ఉద్యోగాలు పొందారు. ప్రతిపాదిత గ్రేటర్‌ అమరావతి పోలీస్‌ కమీషనరేట్‌కు ప్రత్యేక చట్టం తీసుకువచ్చినా అది CRDA పరిధి మొత్తానికి వర్తించదు. హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ అంశంపై ఎదుర్కొన్న వివాదాస్పద పరిణామాలను దృష్టిలో పెట్టుకుని  CRDA ఫ్రీజోన్‌ విధానం అమలుపై పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు.

\r\n

Posted Date: 25-08-2015