https://terrafortune.com:443/news-detail/AP-Government-Released-notification-for-second-phase-land-pooling/48 AP Government Released notification for second phase land pooling - Terrafortune.com AP Government Released notification for second phase land pooling - Terrafortune.com

AP Government Released notification for second phase land pooling

AP రాజధాని రెండవ విడత భూసమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు 33,400 ఎకరాలను భూసమీకరణ చేయగా ఇంకా 3,892 ఎకరాలు సేకరించవలసి ఉంది. భూసమీకరణ ప్రక్రియ దశల వారీగా జరుగుతుంది. 2వ విడతలో 10 గ్రామాలలోని 872 ఎకరాల భూములను సేకరించబోతుంది. తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 29 గ్రామాల పరిధిలో భూసమీకరణ చేయాల్సి ఉంది.అయితే అన్ని గ్రామాలకు ఒకేసారి నోటిఫికేషన్‌ ఇవ్వకుండా, దశల వారీగా నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నారు. తొలి దశలో అతి తక్కువ మొత్తంలో భూసమీకరణ చేయవలసిన గ్రామాలకు నోటిఫికేషన్‌ ఇస్తున్నారు. ఎక్కువ మొత్తంలో భూసేకరణ చేయవలసిన గ్రామాలకు చివరిలో నోటిఫికేషన్లు ఇస్తారు. మొదట 5 గ్రామాలకు మాత్రమే ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ గ్రామాలు తుళ్ళూరు మండలంలోని అనంతవరం, అబ్బరాజుపాలెం, పిచుకల పాలెం, బోరుపాలెం, తుళ్ళూరు-2. ఈ గ్రామాల్లో మొత్తం సేకరించవలసిన భూమి 11.14 ఎకరాలు మాత్రమే. నోటిఫికేషన్‌ జారీ చేసిన తరువాత రైతులకు 30 రోజుల గడువు ఇవ్వబడుతుంది. ఇప్పటికే 150 ఎకరాలకు పైగా భూములు ఇవ్వడానికి రైతులు ముందుకొచ్చారు. ఉండవల్లి గ్రామంలో అత్యధికంగా 992 ఎకరాల భూమిని సేకరించవలసి ఉంది. ఇందులో 42 మంది రైతులు 72 ఎకరాల భూమిని అందచేశారు. తుళ్ళూరు మండలంలోని వెలగపూడి గ్రామంలో ఒకే రైతు కుటుంబానికి చెందిన వారు 63 ఎకరాల భూమిని ఇచ్చారు. మొత్తం 29 గ్రామాల పరిధిలో 3892 ఎకరాల భూమిని సేకరించాలని అధికారులు నిర్ధారించారు. దీనిలో ఎక్కువ భూమి ఉండవల్లి, పెనుమాక, నవులూరు, బేతపూడి, కురగల్లు గ్రామాల్లో ఉంది. ఇదిలా ఉండగా భూసమీకరణకు వ్యతిరేకిస్తున్న రైతులు విజయవాడలోని CRDA కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

\r\n\r\n

 

\r\n

Posted Date: 22-08-2015