https://terrafortune.com:443/news-detail/AP-Government-planing-to-shift-Government-offices-to-Amaravathi-in-1-month/31 AP Government planing to shift Government offices to Amaravathi in 1 month - Terrafortune.com AP Government planing to shift Government offices to Amaravathi in 1 month - Terrafortune.com

AP Government planing to shift Government offices to Amaravathi in 1 month

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెల రోజులలో 25 కీలకమైన ప్రభుత్వ శాఖలను అమరావతికి తరలించి అక్కడి నుంచే ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై ఒక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ కమిటీ CRDA, విజయవాడ, గుంటూరు పరిసరాలలో అందుబాటులో ఉన్న తాత్కాలిక వసతి ప్రాంతాలను గుర్తించనుంది.హోం శాఖ నుంచి వ్యవసాయ శాఖ వరకు దాదాపు 25 ముఖ్యమైన శాఖలను హైదరాబాద్‌ నుండి అమరావతికి తరలించాలని భావిస్తున్నారు.ఇందులో వ్యవసాయం, విద్య, వైద్యం, పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, సంక్షేమం, అటవీ, పర్యావరణ, గృహనిర్మాణ శాఖ తదితరాలను వీలైనంత త్వరగా తరలించాలని నిర్ణయించారు. ఈ శాఖల కార్యాలయాల ఏర్పాటు కొరకు, ఉద్యోగుల నివాస వసతుల కొరకు ఎంత స్థలం కావాలనేది ప్రాధమికంగా అంచనా వేశారు. మొత్తం 20,053 మంది ఉద్యోగులు అమరావతికి తరలిరావాల్సి ఉంటుందని అంచనా. కార్యాలయాల ఏర్పాటు కొరకు 44.77 లక్షల చ.అడుగుల విస్తీర్ణమున్న భవనాలు కావలసి ఉంటుంది. నివాస వసతులకు 1.73 కోట్ల చ.అడుగుల విస్తీర్ణం అవసరమవుతుంది. మొత్తం 2.18 కోట్ల చ.అడుగుల విస్తీర్ణం అవసరమవుతుంది.

\r\n

Posted Date: 29-07-2015