https://terrafortune.com:443/news-detail/AP-Government-releases-notification-for-Amaravathi-land-pooling/44 AP Government releases notification for Amaravathi land pooling - Terrafortune.com AP Government releases notification for Amaravathi land pooling - Terrafortune.com

AP Government releases notification for Amaravathi land pooling

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగర పరిధిలో భూసమీకరణ కింద భూమిలిచ్చేందుకు ఈ నెల 19 వ తేదీని చివరి గడువు తేదీగా నిర్ణయించారు. సమీకరణ కింద భూములిచ్చేందుకు ఆసక్తి చూపని వారికి 20వ తేదీన భూసమీకరణ నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 1500-1700 ఎకరాల వరకు సేకరించాల్సి ఉంటుందని, 20వ తేదీ నుండి ఎట్టి పరిస్థితుల్లో సమీకరణ ప్రస్తావన ఉండదని మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సమీకరణకు ఇకపై సమయం పొడింగించకూడదని నిర్ణయించారు. రాజధాని నగర పరిధిలో 33,979 ఎకరాల పట్టా భూములున్నాయి. వీటిలో 32,900 ఎకరాల భూమిని సమీకరణ కింద ఇచ్చేందుకు యజమానులు అంగీకార పత్రాలు ఇచ్చారు. అంగీకార పత్రాలు ఇచ్చినా సమీకరణ ఇష్టం లేదని వ్రాతపూర్వకంగా అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారి భూమి-336 ఎకరాలు, కోర్టులో వివాదాల్లో ఉన్నది-56 ఎకరాలు, మరికొంత సమయం కావాలని కోరిన వారి భూమి-681 ఎకరాలు, యజమానులు అందుబాటులో లేని భూమి-225 ఎకరాలు, వివాదంలో ఉన్నవి-41 ఎకరాలు, సమీకరణ కింద ఇచ్చినప్పటికీ ఇతరులకు అమ్మిన భూమి- 55 ఎకరాలు. ఇలా పెండింగ్‌ లో ఉన్న వీటన్నింటినీ నెలరోజులలోగా పరష్కరించి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు ప్రకటన జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భూసమీకరణకు అంగీకరించని వారు 5-6 % మంది ఉన్నారు. ఇవ్వబోమన్న వారి నుంచి భూసమీకరణ ద్వారా భూమిని తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.

\r\n

Posted Date: 14-08-2015