https://terrafortune.com:443/news-detail/AP-Government-speed-up-the-process-of-Amaravathi-capital-Development/37 AP Government speed up the process of Amaravathi capital Development - Terrafortune.com AP Government speed up the process of Amaravathi capital Development - Terrafortune.com

AP Government speed up the process of Amaravathi capital Development

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని నిర్మాణాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేయుటకు నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాజధాని నిర్మాణ సలహా కమిటీ నిర్ణయించింది. సింగపూర్‌ ప్రతినిధులు సీడ్‌ కాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను అందించిన తరువాత మొదటిసారి కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఇకపై వేగంగా నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. సింగపూర్‌ ప్రభుత్వం అందించిన CRDA, రాజధాని, సీడ్‌ కాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌లను అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. మంత్రి నారాయణ అధ్యక్షతన సచివాలయంలో రాజధాని నిర్మాణ సలహా సమిటీ సమావేశమైంది. రాజధాని అభివృద్ధిపై పలు అంశాల గురించి కమిటీ చర్చించింది. సీడ్‌ కాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌లోని అంశాలను CRDA కమీషనర్‌ శ్రీకాంత్‌ వివరించారు. సీడ్‌ కాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌ రాజధాని అవసరాలు తీర్చే విధంగా ఉందా లేక ఏవైనా సవరణలు చేయాలా అనే విషయాలపై, సీడ్‌ కాపిటల్‌ అభివృద్ధిపై కమిటీ సభ్యులు చర్చించారు. సీడ్‌ కాపిటల్‌ నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వారం పది రోజులకు ఒకసారి కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణంతో పాటు భూములిచ్చిన రైతులకు వీలైనంత త్వరలో లేఔట్లు వేసి, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవాలని నిర్ణయించారు. సీడ్‌ కాపిటల్‌ నిర్మాణంలో కమిటీ సభ్యులతో పాటు నిపుణుల పర్యవేక్షణ కూడా ఉండాలని ఈ సమావేశంలో సూచించారు. హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యాలయాలను వీలైనంత త్వరలో రాజధాని పరిధిలోకి తరలించడానికి ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే ప్రధాన కార్యాలయాలను తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు.

\r\n

AP Government speed up the process of Amaravathi capital Development
Posted Date: 03-08-2015