https://terrafortune.com:443/news-detail/AP-Government-temporarily-restricting-the-land-sales-and-registrations-in-Amaravathi-capital-region/39 AP Government temporarily restricting the land sales and registrations in Amaravathi capital region - Terrafortune.com AP Government temporarily restricting the land sales and registrations in Amaravathi capital region - Terrafortune.com

AP Government temporarily restricting the land sales and registrations in Amaravathi capital region

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో భూముల క్రయవిక్రయాలను తాత్కాలికంగా నిలిపివేయడానికి సన్నాహాలు  జరుగుతున్నాయి. CRDA పరిధిలోని భూముల రిజిస్ట్రేషన్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు.దీనికొరకు నూతనంగా అమరావతి రిజిస్ట్రేషన్‌ జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. అమరావతి, మందడం, తుళ్ళూరు, అనంతవరంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని అమరావతి రిజిస్ట్రేషన్‌ జిల్లా కిందకు వచ్చేలా చూస్తునారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖతో ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తుంది. దీనిని ముఖ్యమంత్రి ఆమోదించిన వెంటనే అమరావతి కొత్త రిజిస్ట్రేషన్‌ జిల్లా ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అవుతాయి. రాజధాని నగర నిర్మాణం కొరకు రైతుల నుంచి భూసమీకరణ విధానం ద్వారా ప్రభుత్వం 33,400 ఎకరాల భూమిని సమీకరించింది. రైతుల నుంచి అంగీకార పత్రాలు కూడా సేకరించింది. కానీ CRDA పేరిట ఇంతవరకు రిజిస్ట్రేషన్లు జరగలేదు. ఈ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాలను అనుమతిస్తే రైతులు ఈ భూములను అధిక ధరలకు ప్రైవేట్‌ వ్యక్తులు/సంస్థలకు విక్రయించే అవకాశం ఉంది, దీని వలన రాజధాని నిర్మాణానికి ఆటంకం కలుగుతుందనే ఉద్దేశ్యంతో రిజిస్ట్రేషన్లు నిషేదించాలని CRDA కమీషనర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. CRDA ప్రతిపాదనలకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదముద్ర వేయగానే ఈ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాలు నిషేధిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22 (ఎ) నిబంధన కింద ఉత్తర్వులు జారీ చేస్తుంది.CRDA పేరిట రైతుల నుంచి భూముల విక్రయాలకు రిజిస్ట్రేషన్‌ కొరకు కొత్తగా 4 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఏర్పాటు చేస్తునారు. ఇకపై ఈ ప్రాంతంలో క్రయవిక్రయాలన్నీ CRDA ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతాయి.

\r\n\r\n

 

\r\n

Posted Date: 05-08-2015