https://terrafortune.com:443/news-detail/APIIC-to-ready-7.64-lakhs-acres-land-for-industries-establishment-in-Andhra-Pradesh/66 APIIC to ready 7.64 lakhs acres land for industries establishment in Andhra Pradesh - Terrafortune.com APIIC to ready 7.64 lakhs acres land for industries establishment in Andhra Pradesh - Terrafortune.com

APIIC to ready 7.64 lakhs acres land for industries establishment in Andhra Pradesh

APIIC (ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌) ఆంధ్రప్రదేశ్‌ లో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమిని సమకూర్చేందుకు రంగం సిద్ధం చేసింది. దీని కొరకు 13 జిల్లాల్లో 7,64,260 ఎకరాల భూమిని సమకూర్చాలని నిర్ణయించింది. పరిశ్రమల కొరకు శ్రీకాకుళం జిల్లాలో 4493 ఎకరాలు, విజయనగరం జిల్లాలో 16,913 ఎకరాలు, విశాఖపట్నం జిల్లాలో 63,332 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లాలో 64,228 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1388 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 15,384 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 48,634 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 43,996 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 62,112 ఎకరాల భూమి సేకరించబడుతుంది. రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధి కొరకు అధిక మొత్తంలో భూమిని సిద్ధం చేయాలని APIIC భావిస్తుంది. చిత్తూరు జిల్లాలో 1,60,938 ఎకరాలు, కడప జిల్లాలో 1,06,829 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1,29,655 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 45,166 ఎకరాలను సమీకరించబోతున్నారు. గుంటూరు జిల్లాలో పరిశ్రమల కోసం 48,634 ఎకరాలు సేకరించవలసి ఉండగా ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం సుమారు 41 వేల ఎకరాల భూమిని సిద్ధం చేసింది. పరిశ్రమల కొరకు సేకరించే భూములను వీలును బట్టి భూసమీకరణ లేదా భూసేకరణ విధానంలో తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. మైక్రో మరియు స్మాల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం పథకం కింద క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. విశాఖ జిల్లా మాకవారి పాలెం, కడప జిల్లా గండరాజుపల్లి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, గుంటూరు జిల్లా మంగళగిరిలలో పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. మంగళగిరిలో 51.83 ఎకరాల విస్తీర్ణంలో 25.37 కోట్ల అంచనా వ్యయంతో జనరల్‌ ఇంజనీరింగ్‌ పార్కును ఏర్పాటు చేస్తారు. కృష్ణా జిల్లా, మచిలీపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, శ్రీకాకుళం జిల్లా పలాసలలో ఉన్న పరిశ్రమల పార్కులను అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. ఇండస్ట్రియల్‌ పార్కులకు 2453 ఎకరాల భూమిని కేటాయించారు.

\r\n

Posted Date: 22-09-2015