https://terrafortune.com:443/news-detail/Airbus-to-establish-Aerospace-manufacturing-cluster-in-Anantapur-District/38 Airbus to establish Aerospace manufacturing cluster in Anantapur District - Terrafortune.com Airbus to establish Aerospace manufacturing cluster in Anantapur District - Terrafortune.com

Airbus to establish Aerospace manufacturing cluster in Anantapur District

విమానాల తయారీలో అగ్రగామి సంస్థ అయిన ఎయిర్‌బస్‌ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో విమానయాన తయారీ పరిశ్రమల కేంద్రాన్ని నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తుంది. ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించి స్థలాన్ని కేటాయించింది. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయబోయే కేంద్రంలో ఎయిర్‌బస్‌ విమానాల విడిభాగాల తయారీ, నిర్వహణ సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ సంస్థకు విక్రయించుట కొరకు 49.18 ఎకరాల స్థలాన్ని ఏపిఐఐసీకి కేటాయిస్తూ జీవో.264ను జారీ చేసింది. అనంతపురం జిల్లాలోని లేపాక్షి ప్రాజెక్టు సమీపంలో గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామంలో ఈ స్థలం ఉంది. ఎయిర్‌బస్‌ ఎకరానికి 5 లక్షలు చెల్లించాలనే ఒప్పందంతో ప్రభుత్వం ఈ స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలానికి ఆనుకుని ఉన్న మరో 150 ఎకరాల స్థలాన్ని కూడా తీసుకునేందుకు ఎయిర్‌బస్‌ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఎయిర్‌బస్‌ వంటి ఒక పెద్ద సంస్థ పారిశ్రామిక క్లస్టర్‌ ఏర్పాటు చేయుట వలన మరిన్ని అనుబంధ విమాన విడిభాగాల తయారీ సంస్థలు అక్కడకు వస్తాయని, దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అంచనా. అనంతపురం జిల్లా బెంగుళూరుకు సమీపంలో ఉండటం వలన ఈ ప్రదేశం సానుకూలంగా ఉంది. ఇప్పటికే బెంగుళూరులో ఎలక్ట్రానిక్స్‌, సాఫ్ట్‌ వేర్‌, విమానరంగ సంస్థలు చాలానే ఉన్నాయి. ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ బెంగుళూరులో తమ కార్యకలాపాలను నిరహిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఈఎంఎల్‌ కూడా బెంగుళూరులోనే ఉంది. ఇటువంటి సానుకూలతలను పరిగణనలోకి తీసుకుని అనంతపురం జిల్లాలో విమానయాన తయారీ పరిశ్రమల కేంద్రాన్ని నెలకొల్పడానికి ఎయిర్‌బస్‌ ఆసక్తి చూపుతుందని సమాచారం.

\r\n

Posted Date: 04-08-2015