https://terrafortune.com:443/news-detail/Amaravathi-capital-Development-by-Singapore-company-Ascendas/53 Amaravathi capital Development by Singapore company Ascendas - Terrafortune.com Amaravathi capital Development by Singapore company Ascendas - Terrafortune.com

Amaravathi capital Development by Singapore company Ascendas

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అభివృద్ధికి స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో సింగపూర్‌కు చెందిన అసెండాస్‌ కంపెనీని మాస్టర్‌ డెవలపర్‌గా ఎంపిక చేసేందుకు ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఆ కంపెనీ ఎండితో  CRDA చర్చిస్తుంది. తొలిదశలో 3 వేల ఎకరాలను ఈ కంపెనీకి అప్పగించనున్నారు. ఇందులో 375 ఎకరాల్లో ప్రభుత్వ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపడతారు. వీటి నిర్మాణ బాధ్యతలను కూడా అసెండాస్‌కే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. తొలి దశలో ఇచ్చే 3 వేల ఎకరాలపై పూర్తి హక్కులు ఇవ్వాలని అసెండాస్‌ కంపెనీ షరతులు విధించింది. ఐకానిక్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం కొరకు 250 ఎకరాలను కంపెనీకి ఉచితంగా ఇస్తారు. ఇందులో ఐకానిక్‌ కాంప్లెక్స్‌ నిర్మించిన తరువాత కంపెనీ వాటిని విక్రయించుకుంటుంది. అందుకు అనుగుణంగా ఈ 250 ఎకరాలపై కూడా హక్కులు ఇవ్వాలని షరతులు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం 99 ఏళ్ళ పాటు లీజుకు ఇస్తామని అభివృద్ధి చేసిన తరువాత హక్కులు కల్పించాలని ఆలోచిస్తుంది. ఈ 250 ఎకరాల్లో కనీసం 20 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టనున్నారు. స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో మాస్టర్‌ డెవలపర్‌ ఎంపికను అక్టోబర్‌ 22వ తేదీ కి ముందుగా పూర్తి చేయాల్సిందిగా కంపెనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.సింగపూర్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల మధ్య ఎటువంటి జాయింట్‌ వెంచర్‌ ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. నూతన రాజధానిలో భూముల విక్రయం ద్వారా వచ్చే నిధుల్లో వాటా ఇవ్వలని షరతు విధించింది. తొలిదశ రాజధాని అభివృద్ధి అక్టోబర్‌ 2018 నాటికి పూర్తి చేయడానికి కంపెనీ అంగీకరించింది. నూతన రాజధానిలో రహదారులు, నీరు, పారిశుధ్యం, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పన పనులన్నింటికీ అయ్యే ఖర్చును పూర్తిగా మాస్టర్‌ డెవలపర్‌ సంస్థే భరిస్తుంది. రాజధానిలో 217 చ.కి.మీ పరిధిలో మాస్టర్‌ ప్రణాళిక రూపకల్పన, ల్యాండ్‌ పూలింగ్‌ స్కీములో భూమిలిచ్చిన వారికి ఎక్కడ ప్లాట్లు ఇవ్వాలనే ప్రణాళికను రూపొందించే బాధ్యత సింగపూర్‌ కు చెందిన సుర్బానా కంపెనీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుర్బానా 29 గ్రామాల్లోని వారికి ప్లాట్లు ఎక్కడ ఇవ్వాలో మార్కింగ్‌ చేయడంతో పాటు, 217 చ.కి.మీ పరిధిలో భూమి వినియోగం, రవాణా, ఇతర మౌలిక వసతుల ప్రణాళికలను రూపొందిస్తుంది. సెప్టెంబర్‌ 15 వ తేదీ లోపు సుర్బానా కంపెనీ ఈ ప్రణాళికను ప్రభుత్వానికి అందచేయాలి.

\r\n

Posted Date: 31-08-2015