https://terrafortune.com:443/news-detail/Amaravathi-seed-capital-development-of-250-acres-in-first-phase/42 Amaravathi seed capital development of 250 acres in first phase - Terrafortune.com Amaravathi seed capital development of 250 acres in first phase - Terrafortune.com

Amaravathi seed capital development of 250 acres in first phase

అమరావతి సీడ్‌ కాపిటల్‌ తొలి దశలో 250 ఎకరాల భూమిని తీసుకుని అభివృద్ధి చేస్తామని సింగపూర్‌ సంస్థలు ప్రతిపాదించినట్లు సమాచారం. అమరావతి అభివృద్ధిలో భాగస్వాములుగా చేరబోతున్న ఈ సంస్థలు ఒక సమాఖ్యగా ఏర్పడి దశల వారీగా 1300 ఎకరాల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నాయి. సచివాలయం, శాసనసభ, శాసనమండలి, రాజ్‌ భవన్‌, హైకోర్ట్‌, ముఖ్యమంత్రి, మంత్రుల నివాసాలు, తదితరాల్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించుకోవాలని తెలిపినట్లు సమాచారం. రాజధాని కేంద్ర ప్రాంతాన్ని 5 దశలుగా అభివృద్ధి చేయాలని మాస్టర్‌ ప్లాన్‌ లో పేర్కొన్నారు. దీని ప్రకారం మొదటి దశలో 250 ఎకరాలు కేటాయించాలని, వాటి అభివృద్ధి పూర్తి చేశాక మరో 250 ఎకరాలు తీసుకుంటామని ఇలా మొత్తం 1300 ఎకరాలను అభివృద్ధి చేస్తామని సింగపూర్‌ సంస్థలు తెలియచేశాయి. వీటికి ప్రాధమిక వసతులను రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేయాలని, అంతర్గత వసతులను తాము అభివృద్ధి చేస్తామని, పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చేలా చేస్తామని పేర్కొన్నారు. తమకు కేటాయించే భూములపై అన్ని రకాల అధికారాలు ఉండేలా చూడాలని సూచించాయి. ఇవన్నీ ప్రాధమిక చర్చల నిర్ణయాలు మాత్రమే, మరికొన్ని చర్చలు జరిగితే కానీ వీటిపై స్పష్టత రాదు. జపాన్‌ సంస్థల ప్రత్యక్ష భాగస్వామ్యంపై కూడా చర్చలు జరగాల్సి ఉంది.

\r\n

Posted Date: 10-08-2015