https://terrafortune.com:443/news-detail/Amaravathi-seed-capital-first-phase-development-in-3-years/45 Amaravathi seed capital first phase development in 3 years - Terrafortune.com Amaravathi seed capital first phase development in 3 years - Terrafortune.com

Amaravathi seed capital first phase development in 3 years

అమరావతి రాజధాని సీడ్‌ కాపిటల్‌ మొదటి దశ నిర్మాణాలన్నీ మూడేళ్ళలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇకపై రాజధాని వ్యవహారాలు మరింత వేగంగా జరిగేలా ప్రతి శుక్రవారం CRDA   పాలక మండలి సమావేశం నిర్వహిస్తామన్నారు. అమరావతి నిర్మాణంపై మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఐఎఎస్‌ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ముందుగా ప్రకటించినట్లుగా అక్టోబర్‌ 22 విజయదశమి రోజున అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది. 3 సంవత్సరాలలో మొదటి దశ నిర్మాణం పూర్తవుతుంది. రాజధాని నిర్మాణంలో ప్రపంచ స్థాయి సంస్థలు, నిపుణుల సహాయంతో వారి పర్యవేక్షణలో రాజధాని నిర్మాణాలు జరుగుతాయి. సింగపూర్‌ ప్రభుత్వం అందించిన రాజధాని యొక్క మూడు మాస్టర్‌ ప్లాన్‌ లపై నిర్మాణ రంగాల నిపుణులు, అనుభవజ్ఞులతో సుదీర్ఘ చర్చలు జరిపారు, వీటిలో అంతగా మార్పులు చేయవలసిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తమైంది. అమరావతి రాజధాని ఆధునికత, సంప్రదాయాలు మిళితమై ఉంటుంది. పచ్చదనం, పరిశుభ్రత, వినోదం, పర్యాటకం, ఆహ్లాద కేంద్రాల అభివృద్ధి, రవాణా తదితర మౌలిక వసతులను ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దుతామని చంద్రబాబు తెలిపారు. రాజధానిని 4 జాతీయ రహదారులతో అనుసంధానం చేయడంతో పాటు రాజధాని ప్రవేశంలో అత్యాధునిక రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. రాజధాని నిర్మాణానికి రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలతో పాటు, మరొక 20 వేల ఎకరాలు సమీకరించాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం డీనోటిఫై చేయనున్న 50 వేల ఎకరాలను కలిపి మొత్తం లక్ష ఎకరాల విస్తీర్ణంలో అమరావతి అభివృద్ధి జరుగుతుంది.

\r\n

Posted Date: 17-08-2015