https://terrafortune.com:443/news-detail/Amaravathi-to-become-as-universal-city/67 Amaravathi to become as universal city - Terrafortune.com Amaravathi to become as universal city - Terrafortune.com

Amaravathi to become as universal city

అమరావతిని విశ్వనగరంగా రూపొందించడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సింగపూర్‌ పర్యటనలో భాగంగా సింగపూర్‌ సిటీ గ్యాలరీని సందర్శించారు. 21వ శతాబ్ధంలో నిర్మించబడుతున్న అమరావతి రాజధానిలో విద్య, వైద్యం, ఉపాధి, రవాణా లాంటి అన్ని రకాల మౌలిక వసతులతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు నెలకొల్పబడుచున్నాయి. రాజధాని నగరాన్ని ఉద్యానవనాలు, జలాశయాలు, పచ్చదనంతో పర్యావరణ హితంగా తయారుచేస్తామని తెలిపారు. గ్రీన్‌ మరియు బ్లూ స్పేసెస్‌ ప్లానింగ్‌, వ్యర్ధాల నిర్వహణ ప్రాజెక్టులు ఏర్పాటును పరిశీలించారు. కొత్త నగరాల నిర్మాణంలో అనుసరించవలసిన నమూనాలు, నిర్మాణ రీతుల అధ్యయనానికి వీలుగా సింగపూర్‌ పట్టణాభివృద్ధి సంస్థ ఈ గ్యాలరీని అప్‌గ్రేడ్‌ చేస్తుంది. చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని శంకుస్థాపనకు సింగపూర్‌ ప్రధానమంత్రి లిసీన్‌ లూంగ్‌ ను ఆహ్వానించారు. లూంగ్‌ ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. నూతన రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను అనుకున్న సమయానికి అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆర్ధిక, విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని చంద్రబాబు వారిని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న పొడవైన తీరప్రాంతాన్ని దక్షిణ ఆసియా దేశాలకు సరుకు రవాణా కేంద్రంగా తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సింగపూర్‌ ప్రభుత్వం దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రాల్లో 2వ స్థానం సంపాదించడంపై లూంగ్‌ చంద్రబాబును ప్రశంసించారు. సింగపూర్‌ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ లో బౌద్ధ పర్యాటక అభివృద్ధికి ఉన్న విస్తృత అవకాశాల గురించి కూడా చంద్రబాబు వివరించారు. ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు మంత్రులు రామక్రిష్ణుడు, నారాయణ, MP CM.రమేష్, ఆర్ధిక శాఖ కార్యదర్శి PV.రమేష్, CRDA  కమీషనర్‌  N.శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

\r\n

Posted Date: 23-09-2015