https://terrafortune.com:443/news-detail/Amaravthi-seed-capital-Development-Plans/32 Amaravthi seed capital Development Plans - Terrafortune.com Amaravthi seed capital Development Plans - Terrafortune.com

Amaravthi seed capital Development Plans

అమరావతి రాజధాని సీడ్‌ కాపిటల్‌ అన్ని ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అమరావతిలో ప్రభుత్వ పరిపాలనా కేంద్రమే కీలకమైన ప్రాంతం. పాలనాపరంగా 3 కట్టడాలు శాసనసభ, సచివాలయం, హైకోర్టు నిర్మాణ డిజై న్లలో కూడా ప్రత్యేకత చూపించాలని, ఇక్కడ స్థల వినియోగంలో కూడా ప్రత్యేక వ్యూహాలను అనుసరించాలని సింగపూర్‌ ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ లో పేర్కొంది. అమరావతి సీడ్‌ కాపిటల్‌ ప్రధానంగా 3 భాగాలుగా విభజించి అభివృద్ధి చేయబడుతుంది. అవి అమరావతి గేట్‌ వే: ఇది రాజధాని ముఖ ద్వారం. రాజధానికి, సీడ్‌ కాపిటల్‌ కు ఇదే గేట్‌ వే.అమరావతి రాజధానికే గేట్‌వే చిహ్నంగా ఉంటుంది. ఇక్క డే ఐకానిక్‌ టవర్స్‌ నిర్మిస్తారు. ఈ కట్టడాల ముందు విశాలమైన పచ్చని ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఉంటాయి.డౌన్‌ టౌన్‌: ఇదొక ముఖ్య వ్యాపార కేంద్రం.ప్రజారవాణా సౌకర్యాల ద్వారా సులభంగా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడి భవనాలు మెట్రో రైలు స్టేషన్స్‌ తో సమీకృతమయ్యేలా ఉంటాయి. వాటర్‌ ఫ్రంట్‌: వాణిజ్య, వినోద అవసరాలు తీర్చేవిధంగా వాటర్‌ ఫ్రంట్‌ ను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తారు. ఈ సమీపంలోనే అమరావతి ప్లాజా ఉంటుంది. వాటర్‌ ఫ్రంట్‌ లో ఆంఫీ థియేటర్లు ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాలన్ని 59.88 హెక్టార్లలో తొలి దశలోనే పూర్తి చేయాల్సి ఉంది. 2018 నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. అమరావతి కేంద్ర ప్రాంత పరిధిలోని మొత్తం 1694.06 హెక్టార్లలో ఉద్యానవనాలు, పచ్చదనానికి అత్యధికంగా 331.42 హెక్టార్లను కేటాయించారు.

\r\n

Posted Date: 24-07-2015