https://terrafortune.com:443/news-detail/Andhra-Pradesh-CRDA-region-to-be-extended-upto-8200-sq.km/47 Andhra Pradesh CRDA region to be extended upto 8200 sq.km - Terrafortune.com Andhra Pradesh CRDA region to be extended upto 8200 sq.km - Terrafortune.com

Andhra Pradesh CRDA region to be extended upto 8200 sq.km

AP ప్రభుత్వం CRDA పరిధిని విస్తరించబోతుంది. CRDA పరిధిలోకి కొన్ని గ్రామాలను చేర్చనుంది. రాజధాని అవసరాలు, శాంతి భద్రతలు, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్థుత   పరిధిలో కొన్ని మార్పులతో త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. CRDA పరిధి దాదాపు 8200 చ.కి.మీ. కు పైగా పెరుగుతుందని సమాచారం. CRDA పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 58 మండలాలు ఉన్నాయి. వీటిలో 33 మండలాలు పూర్తిగా, 25 మండలాలు పాక్షికంగా CRDA పరిధిలోకి వస్తాయి. వీటితో కలిపి విస్తీర్ణం 7420 చ.కి.మీ.ఉంటుంది. దీనిలో కొన్ని గ్రామాలను తొలగించాలని, కొన్ని గ్రామాలను చేర్చాలని భావిస్తున్నారు. తెలంగాణా సరిహద్దులోని జగ్గయ్య పేట మండలం, మున్సిపాలిటీ మచిలీపట్నం సమీపంలోని వత్ససాయి మండలంలో విలీనం కానున్నాయి. శాంతి భద్రతలు, సరిహద్దు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. సరిహద్దు మండలాల్లో 3 లోపు గ్రామాలు CRDA  కు అవతల ఉంటే వాటిని CRDAలో కలుపుతారు. ఒకవేళ ఒకటి రెండు గ్రామాలు మాత్రమే CRDA పరిధి లోకి వస్తే వాటిని వదిలివేయాలని భావిస్తున్నారు. కృష్ణా జిల్లాలో 3 మండలాలు, గుంటూరు జిల్లాలో 11 మండలాల్లో మార్పులు జరుగుతాయి. CRDA పరిధి మొత్తం పోలీస్‌ కమీషనరేట్‌ మారుతుంది. మండలానికి ఒక పోలీస్‌ స్టేషన్‌ నెలకొల్పబడుతుంది. ఇది దేశంలోనే అతిపెద్ద కమీషనరేట్‌ గా అవతరించబోతుంది. గ్రామాల విలీనం, తొలగింపు ద్వారా ప్రజలకు ఇబ్బందులు తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

\r\n

Posted Date: 21-08-2015