https://terrafortune.com:443/news-detail/Andhra-Pradesh-Government-Initiates-Steps-To-Develop-10-New-Ports/55 Andhra Pradesh Government Initiates Steps To Develop 10 New Ports - Terrafortune.com Andhra Pradesh Government Initiates Steps To Develop 10 New Ports - Terrafortune.com

Andhra Pradesh Government Initiates Steps To Develop 10 New Ports

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10 కొత్త పోర్ట్‌లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తుంది.  AP కు ఉన్న 974 కి.మీ.పొడవైన తీర ప్రాంతాన్ని సమర్ధవంతంగా వినియోగించుకుని వేగంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారు. దీనిలో భాగంగానే 10 నూతన పోర్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అవి మచిలీపట్నం పోర్ట్‌, నిజాంపట్నం పోర్ట్‌, కాకినాడ సెజ్‌ పోర్ట్‌, భవనపాడు పోర్ట్‌, నర్సాపూర్‌ పోర్ట్‌, రామాయపట్నం పోర్ట్‌, మేఘవరం పోర్ట్‌, నక్కపల్లి పోర్ట్‌, ఓడరేవు మరియు దుగరాజపట్నం పోర్ట్‌. కాకినాడ సెజ్‌ పోర్ట్‌, మేఘవరం పోర్ట్‌ మరియు నక్కపల్లి పోర్ట్‌లను వేర్వేరు డెవలపర్స్‌కు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాలోని భవనపాడు పోర్ట్‌కు టెక్నో ఎకనామిక్‌ ఫిజిబిలిటీ రిపోర్ట్‌ (TEFR) ను తయారు చేశారు. రిక్వస్ట్‌ ఫర్‌ కొటేషన్‌ (RfQ) ను కూడా ఇష్యూ చేశారు. పోర్ట్‌కు లాండ్‌ ను కూడా గుర్తించారు. ఆ ఫైల్‌ ను జిల్లా కలెక్టర్‌కు ఇచ్చారు.నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నం పోర్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ 2014 కింద అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరారు. నర్సాపూర్‌ (వెస్ట్‌ గోదావరి), రామాయపట్నం (ప్రకాశం) పోర్ట్‌లకు రైల్‌ ఇండియా టెక్నికల్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ (RITES)  అక్టోబర్‌ లోగా TEFR ను పూర్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. నర్సాపూర్‌, రామాయపట్నం మరియు మచిలీపట్నం పోర్ట్‌లకు లాండ్‌ను గుర్తించే పనిలో ఉన్నారు. నిజాంపట్నం మరియు ఓడరేవు పోర్ట్‌లకు కొన్ని చట్టపరమైన సమస్యలు ఉన్నాయి.

\r\n

Posted Date: 02-09-2015