https://terrafortune.com:443/news-detail/Andhra-Pradesh-Temporary-Assembly-to-be-built-in-Thullur/72 Andhra Pradesh Temporary Assembly to be built in Thullur - Terrafortune.com Andhra Pradesh Temporary Assembly to be built in Thullur - Terrafortune.com

Andhra Pradesh Temporary Assembly to be built in Thullur

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరులో తాత్కాలిక శాసనసభా భవనాన్ని నిర్మించబోతుంది. AP అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావు దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు.దీని గురించి ఇంజనీరింగ్‌ అధికారులతో స్పీకర్‌ సమావేశమయ్యారు.తుళ్ళూరులో తాత్కాలిక అసెంబ్లీని నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు 5 ఎకరాల స్థలంలో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. డిశెంబర్‌ లో జరగబోయే శీతాకాల సమావేశాలు తుళ్ళూరులోనే జరపాలని భావిస్తున్నారు. తక్కువ సమయం ఉండటం వలన దీనిని ఒక ప్రతిష్టాత్మక మిషన్‌ గా భావించి యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించాలని స్పీకర్‌ అధికారులను ఆదేశించారు. 5 రోజుల పాటు తుళ్ళూరులో శీతాకాల సమావేశాలు జరుగుతాయని స్పీకర్‌ తెలిపారు.  R&B ఇంజినీర్స్‌ అసెంబ్లీ భవన నిర్మాణాణికి ఒక నమూనాను కూడా తయారుచేశారు.స్పీకర్‌ దీనికి కొన్ని మార్పులు చేయాలని సూచించారు, ఈ నమూనాకు ముఖ్యమంత్రి ఆమోదం తెలపగానే పనులను ప్రారంభిస్తారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి సమీపంలోనే 5 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్థుత శాసనసభను తలపించేలా దీని నిర్మాణం చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కార్యాలయాలను తాత్కాలిక రాజధాని విజయవాడకు తరలిస్తున్నట్లుగానే స్పీకర్‌ తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని తుళ్ళూరులో నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే అనేక కీలకమైన అడ్మినిష్ట్రేషన్‌ డిపార్ట్‌ మెంట్‌ లు అమరావతికి తరలించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కార్యకలాపాలన్నీ నూతన రాజధాని నుండే జరిగేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

\r\n

Posted Date: 14-10-2015