https://terrafortune.com:443/news-detail/Andhra-Pradesh-seed-capital-Latest-Updates/34 Andhra Pradesh seed capital Latest Updates - Terrafortune.com Andhra Pradesh seed capital Latest Updates - Terrafortune.com

Andhra Pradesh seed capital Latest Updates

రాజధాని సీడ్‌ కాపిటల్‌ మాస్టర్‌  ప్లాన్‌ను సింగపూర్‌ ప్రభుత్వం జులై 20న అందచేయడంతో కీలకమైన ఘట్టం పూర్తయింది. అక్టోబర్‌ 22న శంకుస్థాపన్‌ చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర నడిబొడ్డున కృష్ణానదీ తీరాన రాజధాని నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.రాజధాని సీడ్‌ కాపిటల్‌ నిర్మాణం 16.9 చ.కి.మీ. విస్తీర్ణంలో జరుగుతుంది.2018 నాటికి ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.అమరావతి నిర్మాణం 217 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంటుంది. అమరావతి నిర్మాణం 3 దశల వారీగా 35 సంవత్సరాలలో పూర్తి అవుతుంది.CRDA పరిధి 7420చ.కి.మీ. ఉంటుంది.CRDAకి కాన్సెప్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌, రాజధాని నగరానికి మాస్టర్‌ ప్లాన్‌, సీడ్‌ కాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమయ్యాయి. సీడ్‌ కాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో 4 రకాల సముదాయాలను ప్రతిపాదించారు. తక్కువ భూమిని వినియోగిస్తూ బహుళ అంతస్థుల భవనాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. అందరికీ ఉపాధి, ఇళ్ళు, పరిశుభ్రత, పచ్చదనం, నాణ్యమైన జీవనం, అత్యాధునిక రవాణా వ్యవస్థ, వనరుల సమర్ధ వినియోగం, వారసత్వ సంపద పరిరక్షణ, అమరావతి ప్రాధమిక లక్ష్యాలుగా సింగపూర్‌ ప్రభుత్వం అందించిన ప్రణాళికలో పేర్కొంది. సీడ్‌ కాపిటల్‌ ప్రణాళికను పబ్లిక్‌ డొమైన్‌గా ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతామని ప్రజల సలహాలు, సూచనలు తీసుకుంటామని అవసరమైతే ప్రణాళికలో మార్పులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధంగా రాజధాని నిర్మాణ దిశగా ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.

\r\n

Posted Date: 27-07-2015