https://terrafortune.com:443/news-detail/Andhrapradesh-government-signed-8-Agreements-on-the-same-day-for-tourism-project-investments/71 Andhrapradesh government signed 8 Agreements on the same day for tourism project investments - Terrafortune.com Andhrapradesh government signed 8 Agreements on the same day for tourism project investments - Terrafortune.com

Andhrapradesh government signed 8 Agreements on the same day for tourism project investments

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం ప్రాజెక్ట్‌లపై పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ముందుకొచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించాయి. ఒకే రోజున 1240 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యమంత్రి సమక్షంలో టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నీరబ్‌ కుమార్‌ MOUలపై సంతకం చేశారు. వివిధ ప్రాజెక్ట్‌లపై ఆయా సంస్థల ప్రతినిధులు, పర్యాటక శాఖ కార్యదర్శి ప్రసాద్‌ MOUలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో  CMO ముఖ్యకార్యదర్శి సతీష చందర్‌, పర్యాటక శాఖ కమీషనర్‌ రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్‌ భూముల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన ప్రైవేట్‌ పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి ప్రొవిజనల్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలను అందచేశారు. విజయవాడ, తిరుపతి, వైజాగ్‌ లలో అమ్యూజ్‌ మెంట్‌  పార్కులు, వాటర్‌ వరల్డ్‌ నిర్మాణానికి 800 కోట్ల పెట్టుబడి కట్టడానికి  LEPL వెంచర్స్‌, ముంబైకు చెందిన SL వరల్డ్‌ కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. ఎయిర్‌ కోస్టా విజయవాడ, తిరుపతి, వైజాగ్‌ లలో డెస్టినేషన్‌ టూర్స్‌, ప్యాకేజ్‌ టూర్స్‌ కొరకు పెట్టుబడులు పెట్టబోతుంది, హోటళ్ళు, రిసార్టుల కొరకు ప్లియర్‌ హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పెట్టుబడులు పెడుతుంది. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందించిన సంస్థలు వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నంలోని రిషికొండ ప్రాంతంలో సాయి ప్రియ బీచ్‌ రిసార్ట్‌ వారు 50 కోట్లతో బీచ్‌ రిసార్ట్‌ నిర్మాణం, VSNL ఎస్టేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 300 కోట్లతో 3,5 స్టార్‌ హోటళ్ళ నిర్మాణం, బ్లిస్‌ హోటల్‌ గ్రూప్‌ తిరుపతిలో 85 కోట్లతో గేట్‌వే 5 స్టార్‌ హోటల్‌ నిర్మాణం, కడపలో 5 కోట్లతో వే సైడ్‌ ఎమినిటీస్‌. గత నెలలో రాష్ట్ర టూరిజం పాలసీ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన ఒప్పందాలు, ఇప్పుడు జరిగిన ఒప్పందాలు కలిపి మొత్తం పెట్టుబడులు 4500 కోట్లకు చేరాయని టూరిజం ముఖ్య కార్యదర్శి తెలిపారు.

\r\n

Posted Date: 11-10-2015