https://terrafortune.com:443/news-detail/Britannia-company-planning-to-set-up-an-agro-processing-unit-in-Andhra-pradesh/59 Britannia company planning to set up an agro processing unit in Andhra pradesh - Terrafortune.com Britannia company planning to set up an agro processing unit in Andhra pradesh - Terrafortune.com

Britannia company planning to set up an agro processing unit in Andhra pradesh

బ్రిటానియా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఆంధ్రప్రదేశ్‌ లో ఆగ్రో ప్రాసెసింగ్‌ యూనిట్‌ ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దీని గురించి చర్చించుటకు బ్రిటానియా సంస్థ ఎండి వరుణ్‌ బెర్రి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు. చిత్తూరు జిల్లాలో ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభిస్తామని తెలిపారు. దీని కొరకు 125 కోట్ల పెట్టుబడి పెట్టాడానికి ముందుకొచ్చారు. 2016 చివరి లోగా మొదటి దశ ప్రాజెక్ట్‌ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. చెన్నై, బెంగుళూరు మార్కెట్‌ అవసరాలు తీర్చడానికి అనువైన ప్రదేశం కోసం అంవేషిస్తున్నామని బ్రిటానియా ఎండి చంద్రబాబుకు తెలిపారు.  చిత్తూరు జిల్లా ప్రాంతం అనువుగా ఉంటుందని, కంపెనీ అవసరాలు తీరుస్తుందని చంద్రబాబు సూచించారు. బ్రిటానియా వ్యాపారంలో 75 % వాటా బిస్కెట్లదేనని, డెయిరీ ఉత్పత్తుల తయారీలో కంపెనీ నిమగ్నమైందని బెర్రీ వివరించారు. చిత్తూరు జిల్లా చెన్నై, బెంగుళూరులకు మధ్యలో ఉండటం వలన ఈ ప్రాంతం కంపెనీ ఏర్పాటు చేయుటకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్లాంట్‌ చెన్నైకు 160 కి.మీ. దూరంలో మరియు బెంగుళూరుకు 180 కి.మీ. దూరంలో ఉంది. ఈ సమావేశంలో డైరీ ఉత్పత్తులపై కూడా పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు సూచించారు.  

\r\n

Posted Date: 09-09-2015