https://terrafortune.com:443/news-detail/CRDA-estimated-53,547-crores-budget-for-Amaravathi-capital-development-in-next-10-years/61 CRDA estimated 53,547 crores budget for Amaravathi capital development in next 10 years - Terrafortune.com CRDA estimated 53,547 crores budget for Amaravathi capital development in next 10 years - Terrafortune.com

CRDA estimated 53,547 crores budget for Amaravathi capital development in next 10 years

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి వచ్చే 10 సంవత్సరాలలో 53,547 కోట్ల బడ్జెట్‌ అవసరమవుతుందని CRDA అంచనా వేసింది. భూసమీకరణతో పాటు అమరావతి సిటీ, సీడ్‌ కాపిటల్‌, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ కాంప్లెక్స్ ల  నిర్మాణానికి రాబోయే పదేళ్ళలో ఏ ఏడాది ఎన్ని నిధులు అవసరమవుతాయి అనే అంచనాలను CRDA ప్రతిపాదించింది. ప్రస్థుత ఆర్ధిక సంవత్సరంలో   పరిపాలన తదితర అవసరాల కొరకు 171.56 కోట్ల బడ్జెట్‌ అవసరమని అంచనా వేసింది. ప్రభుత్వ కాంప్లెక్స్ ల నిర్మాణానికి 3560 కోట్లు అవసరమని భావిస్తుంది. గ్రామస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు 541 కోట్లు, సీడ్‌ కాపిటల్‌ లో మౌలిక వసతుల కల్పనకు 28,711 కోట్లు, లాండ్‌ పూలింగ్‌ స్కీము అమలుకు 15,921 కోట్లు అవసరమని CRDA అంచనా ప్రకారం తెలిసింది. రంగాల వారీగా ఏ ఆర్ధిక సంవత్సరంలో ఎన్ని నిధులు అవసరమని CRDA లెక్కించింది. 2015-16 సంవత్సరానికి భూసమీకరణకు 1903 కోట్లు, అమరావతి మౌలిక వసతులకు 475 కోట్లు, CRDA కు 171 కోట్లు అవసరమని మొత్తం ఈ సంవత్సరానికి 2550 కోట్లు అవసరమని తేల్చింది. ఈ విధంగా వచ్చే పది సంవత్సరాలకు రాజధాని నిర్మాణానికి 53,547 కోట్ల రూపాయల బడ్జెట్‌ అవసరమని CRDA అంచనా వేసింది.

\r\n

Posted Date: 12-09-2015