https://terrafortune.com:443/news-detail/Central-Government-released-the-list-of-98-smart-cities/52 Central Government released the list of 98 smart cities - Terrafortune.com Central Government released the list of 98 smart cities - Terrafortune.com

Central Government released the list of 98 smart cities

కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ సిటీ మిషన్‌ ద్వారా అభివృద్ధి చేయబోతున్న 98 నగరాల జాబితాను ప్రకటించింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ఈ జాబితాను ప్రకటించారు. సిటీ చాలెంజ్‌ పద్ధతిలో ఈ నగరాలను ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌ నుండి విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ,  తెలంగాణా నుండి గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రేటర్‌ వరంగల్‌ ఎంపికయ్యాయి. మొత్తం ఎంపిక చేయబడిన 98 నగరాలలో ఉత్తరప్రదేశ్‌కు గరిష్టంగా 13 నగరాలు, తమిళనాడుకు 12, మహారాష్ట్రకు 10, మధ్యప్రదేశ్‌కు 7, గుజరాత్‌, కర్ణాటకకు 6, ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌లకు 3, మిగిలిన రాష్ట్రాలకు రెండు, ఒకటి చొప్పున నగరాలను కేటాయించారు. ఈ నగరాల అభివృద్ధికి రాబోయే 5 సంవత్సరాలలో దాదాపు 48 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 48 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చించగా దీనికి సమానంగా రాష్ట్రాలు, పురపాలక సంఘాలు కూడా 48 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. దీనితో మొత్తం వ్యయం 96 వేల కోట్లు అవుతుంది. స్మార్ట్‌ సిటీలుగా ఎంపికైన 98 నగరాల్లో 24 నగరాలు రాజధాని నగరాలే.ఈ 98 నగరాల్లో 90 సిటీలు అమృత్‌ నగరాల జాబితాలో ఉన్నవే. ప్రకటించిన 98 నగరాలకు త్వరలో 2 కోట్ల నిధులు మంజూరు చేస్తారు. ఆకర్షణీయ నగరాల ప్రణాళికలు రూపొందించడానికి వీటిని వినియోగిస్తారు. ప్రణాళికల రూపకల్పన కొరకు ప్రముఖ సంస్థల నుంచి నిపుణుల బృందాలను కూడా ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం ఒక్కో నగరానికి 200 కోట్ల చొప్పున, తరువాత నాలుగు సంవత్సరాల పాటు 100 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తారు. స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ద్వారా ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, పురపాలక సంస్థ భాగస్వాములుగా ఉంటాయి. స్మార్ట్‌ సిటీస్‌ అభివృద్ధి చెందడానికి కనీసం 5-10 సంవత్సరాల సమయం పడుతుందని అంచనా చేస్తున్నారు.

\r\n

Posted Date: 28-08-2015