https://terrafortune.com:443/news-detail/Central-Government-sanctioned-1000-crores-temporary-relief-fund-to-Andhra-Pradesh/69 Central Government sanctioned 1000 crores temporary relief fund to Andhra Pradesh - Terrafortune.com Central Government sanctioned 1000 crores temporary relief fund to Andhra Pradesh - Terrafortune.com

Central Government sanctioned 1000 crores temporary relief fund to Andhra Pradesh

నవ్యాంధ్రప్రదేశ్‌ నిధుల కొరత తీర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయత్నం ఫలించింది. ఈ ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు 1000 కోట్ల రూపాయల తత్కాలిక సహాయ ప్యాకేజీని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు సింగపూర్‌ పర్యటన ముగించుకుని నేరుగా ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేక ప్యాకేజీ గురించి అరుణ్‌ జైట్లీతో చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా కేంద్రం 1000 కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందించింది. ఈ 1000 కోట్లలో 350 కోట్లు రాజధాని నిర్మాణానికి, మరో 350 కోట్లు వెనుకబడిన 7 జిల్లాల అభివృద్ధికి ఒక్కో జిల్లాకు 50 కోట్లు, 300 కోట్లు పోలవరం నిర్మాణానికి మంజూరు చేశారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీలతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పారిశ్రామిక రాయితీలపై కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని చంద్రబాబు తెలిపారు.  APలో వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏర్పాటుకు 200 కోట్ల రూపాయలు కేటాయించారని, అంర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పడానికి కూడా సహాయం అందిస్తామని రాధామోహన్‌ సింగ్‌ హామీ ఇచ్చారని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో 3 అంతర్జాతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని విమానయానశాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజును ఆదేశించారు. APలో కార్గో జెట్టీల ఏర్పాటుకు 25 కోట్లు, ప్యాసెంజర్‌ జెట్టీల ఏర్పాటుకు 10 కోట్లు ఇవ్వడానికి గడ్కరీ హామీ ఇచ్చారని తెలిపారు. కూచిపూడి నృత్యం అభివృద్ధికి 50 కోట్లు కేటాయిస్తామని పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌ వర్మ తెలియచేశారు. రాష్ట్రంలో గత 16 నెలలలోనే 10 కేంద్ర సంస్థలు ఏర్పాటు అయ్యాయని చంద్రబాబు వివరించారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌ లో Ap ప్రాజెక్టుల కొరకు మరిన్ని నిధులు విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చంద్రబాబు తెలిపారు.

\r\n

Posted Date: 28-09-2015