https://terrafortune.com:443/news-detail/Central-Government-sanctioned-192-crores-to-Prepare-smart-city-Plans/57 Central Government sanctioned 192 crores to Prepare smart city Plans - Terrafortune.com Central Government sanctioned 192 crores to Prepare smart city Plans - Terrafortune.com

Central Government sanctioned 192 crores to Prepare smart city Plans

స్మార్ట్‌ సిటీ మిషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి 100 నగరాలను ఎంపిక చేశారు. ఇందులో 96 నగరాలకు స్మార్ట్‌ సిటీ ప్రణాళికలు రూపొందించడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 192 కోట్ల నిధులను మంజూరు చేసింది. అంటే ప్రతి స్మార్ట్‌ సిటీ ప్రణాళిక కొరకు 2 కోట్ల రూపాయలు అందిస్తారు. నగరపాలక సంస్థలు సాంకేతిక పరిజ్ఞాన సంస్థలతో వారి నగరాలను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. దీని కొరకు 3 నెలల గడువు ఇవ్వబడుతుంది. 3 నెలల తరువాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు ఈ ప్రణాళికలు అందించబడతాయి. వాటిలో అత్యుత్తమంగా ఉన్న 20 ప్రణాళికలు ఎంపిక చేయబడతాయి. ఈ ఆర్ధిక సంవత్సరానికి ఎంపిక చేసిన ఆ 20 నగరాలను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేయుటకు ఆర్ధిక సహాయాన్ని అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌సిటీ మిషన్‌లో మొత్తం 100 నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వీటిలో ఇప్పటికి 98 నగరాలను ఎంపిక చేశారు. 98 నగరాల్లో ఢిల్లీ, చంఢీగడ్‌ నగరాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ త్వరలోనే నిధులను మంజూరు చేస్తుంది. జమ్మూ కాశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌ల నుండి మరో 2 నగరాలను ఎంపిక చేయాల్సి ఉంది. స్మార్ట్‌ సిటీలపై ఢిల్లీలో ఒక వర్క్‌ షాప్‌ను నిర్వహించారు. ఇందులో 11 రాష్ట్రాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వర్క్‌ షాపులో 38 నగరాలకు సంబంధించిన నిధుల మంజూరు ఉత్తర్వులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆయా రాష్ట్ర ప్రతినిధులకు అందచేశారు. దేశంలో మొత్తం 100 స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 48,000 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తుంది దానికి సమాన మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పురపాలక సంఘాలు ఖర్చు చేయవలెనని ప్రభుత్వం తెలియచేసింది.

\r\n

Posted Date: 04-09-2015