https://terrafortune.com:443/news-detail/Different-types-of-loans-that-you-must-know-about-house,land/79 Different types of loans that you must know about house,land - Terrafortune.com Different types of loans that you must know about house,land - Terrafortune.com

Different types of loans that you must know about house,land

బ్యాంకులు కేవలం ఇళ్ళ కొనుగోలు కోసమే కాకుండా ఇతర అవసరాలకు కూడా లోన్స్‌ ఇస్తాయి. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఎక్కువ శాతం మంది గృహ రుణాలపైనే ఆధారపడతారు. అదే విధంగా కొంత మది సొంతంగా ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటారు. సొంత ఇంటిని నిర్మించుట కొరకు అవసరమైన స్థలం కొనడానికి కూడా బ్యాంకులు రుణాలు ఇస్తాయి. దీన్ని లోన్‌ ఫర్‌ బయింగ్‌ లాండ్‌ అని కూడా అంటారు. కానీ ప్లాటును కొన్న తరువాత 2-3 సంవత్సరాల లోపు ఇల్లు నిర్మించాలని నిబంధన విధిస్తారు. అలా చేయని పక్షంలో అధిక వడ్డీని వసూలు చేస్తారు. దీనితో పాటు సొంత ఇంటిని నిర్మించుకోవాలనే వారికి కూడా లోన్‌ సౌకర్యం ఉంటుంది. దీని కొరకు నిర్మాణానికి అయ్యే ఖర్చును స్పష్టంగా తెలుపవలసి ఉంటుంది. దాన్ని బట్టి లోన్‌ సాంక్షన్‌ చేయాలా లేదా అని బ్యాంకు నిర్ణయం తీసుకుంటుంది. కెనరా బ్యాంకు, యుకో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బాంక్‌ ఆఫ్‌ బరోడా మొదలగు బ్యాంకులు ఈ విధమైన రుణాలను ఎక్కువగా ఇస్తున్నాయి. అంతే కాకుండా ఇప్పటికే బ్యాంకు రుణంతో ఇల్లు కట్టుకుని దానిపై మరొక ఫ్లోర్‌ నిర్మించడానికి కూడా లోన్‌ సౌకర్యం ఉంటుంది. దీన్ని హోం ఎక్స్‌టె న్షన్‌ లోన్‌ అంటారు. ఇల్లు కొన్న తరువాత దానికి సరికొత్త మార్పులు చేసి మెరుగులు దిద్దడానికి కూడా బ్యాంకు లోన్‌ తీసుకోవచ్చు. దీనిని హోం ఇంప్రూవ్‌మెంట్‌ లోన్‌ అంటారు. ఈ రకమైన లోన్స్‌ ను  HDFC బ్యాంక్‌,   ICICI బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, విజయ బ్యాంక్‌ వంటి బ్యాంకులు అందిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి స్థలం తీసుకుని గృహం నిర్మించుకోవాలని అనుకుంటారు. ఇలాంటి వారు గరిష్టంగా ముగ్గురు సభ్యులు కలిసి అందరి పేరుతో ఒక జాయింట్‌ అకౌంట్‌ ద్వారా రుణం పొందవచ్చు.80 % వరకూ రుణం లభించే అవకాశం ఉంది. వీటితో పాటు ఒకసారి లోన్‌ సాంక్షన్‌ అయిన తరువాత కూడా అదనంగా లోన్‌ తీసుకునే సౌలభ్యం ఉంటుంది. ఆ లోన్‌ మీ నికర ఆదాయం, ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.

\r\n

Posted Date: 21-11-2015