https://terrafortune.com:443/news-detail/Dubai-Company-investments-in-Andhra-Pradesh/46 Dubai Company investments in Andhra Pradesh - Terrafortune.com Dubai Company investments in Andhra Pradesh - Terrafortune.com

Dubai Company investments in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి దుబాయ్‌ కంపెనీలు ముందుకొచ్చాయి. ఒక దుబాయ్‌ ఆధారిత కంపెనీ APలో లక్ష కోట్ల పెట్టుబడులతో భారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతుంది. ఆ కంపెనీ ప్రతినిధులు నెల్లూరు తీర ప్రాంతంలో 3,000 ఎకరాల భూమి కోసం అధికారులను సంప్రదించారు. కానీ నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంత భూములను మల్టీ నేషనల్‌ కంపెనీల కొరకు కేటాయించడం వలన అధికారులు ఆ కంపెనీ ప్రతినిధులను ప్రకాశం జిల్లాలో భూములు పరిశీలించవలసినదిగా కోరారు. ఈ కంపెనీ సొంత పోర్టును ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తుంది. ప్రకాశం జిల్లాలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయుటకు వారు అంగీకరించారు. ఈ కంపెనీ ఒక పెద్ద పెట్రోలియం రిఫైనరీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ కంపెనీ ప్రారంభమయితే 50,000 మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. అంతా సజావుగా జరిగి ఈ కంపెనీ ప్రారంభిస్తే ఇది భారత దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) ప్రాజెక్ట్‌ అవుతుంది. అధికారులు ఈ కంపెనీ కొరకు స్థలాన్ని పరిశీలించడంలో నిమగ్నమయ్యారు. భారీ ప్రాజెక్ట్‌ కావడం వలన ప్రభుత్వం కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ కంపెనీ ఆధారంగా కొన్ని అనుబంధ కంపెనీలు ఏర్పడే అవకాశం ఉందని, మరికొన్ని వేల ఉద్యోగాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ కంపెనీ మార్కెట్‌ ధర చెల్లించి భూమి కొనుగోలు చేయడానికి కూడా సముఖంగా ఉంది.

\r\n

Posted Date: 20-08-2015