https://terrafortune.com:443/news-detail/Formation-of-9-cities-for-9-sectors-in-Amaravathi-capital/76 Formation of 9 cities for 9 sectors in Amaravathi capital - Terrafortune.com Formation of 9 cities for 9 sectors in Amaravathi capital - Terrafortune.com

Formation of 9 cities for 9 sectors in Amaravathi capital

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భవిష్యత్తు తరాల వారికి పుష్కలమైన ఉపాధి అవకాశాళు కల్పించడానికి అమరావతి రాజధానిలో పునాది రాళ్ళు వేయడానికి సన్నాహాలు చేస్తుంది. ప్రతిభావంతులు ఉపాధి అవకాశాల కొరకు దేశం దాటి వెళ్ళకుండా, దేశ విదేశాల వారు ఇక్కడికి వచ్చి అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఏర్పాటు చే యడానికి AP ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. ఇందులో భాగంగానే నవ్యాంధ్ర రాజధానిలో 9 ముఖ్యమైన రంగాలకు (పరిపాలన, ఆర్ధిక, విద్య, విజ్ఞాన, ఆరోగ్య, క్రీడా, ఎలక్ట్రానిక్‌, న్యాయ, పర్యాటక)  నగరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క నగరం చుట్టూ దాని అనుబంధ నగరాలు అనుసంధానమయేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందులో ఒక్కో నగరానికి 500 ఎకరాల స్థలం కేటాయించే అవకాశం ఉన్నట్లు మంత్రి వర్గం నుండి సమాచారం. ప్రధాన రంగాలన్నిటికీ రాజధాని ప్రాంతంలో చోటు కల్పించారు. ఈ 9 నగరాలు రాజధాని అమరావతి చుట్టూ ఉండేలా నిర్మిస్తారు. పరిపాలనా నగరం-ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన ప్రధాన విభాగాలన్నీ ఇందులోనే ఉంటాయి. రాజ్‌ భవన్‌, ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం, అసెంబ్లీ, కమీషనరేట్స్‌, కేంద్రప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పాక్షిక ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ ఏర్పాటు అవుతాయి. ప్రభుత్వ పనుల కొరకు వచ్చే వారికి అన్ని వ్యవస్థలు ఒకేచోట అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యా నగరం-ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళకుండా జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేసేందుకు రూపకల్పన చేస్తునారు. విజ్ఞాన నగరం-శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. క్రీడా నగరం-భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి క్రీడా ఉత్సవాలు జరుపుటకు వీలుగా అంతర్జాతీయ స్థాయి క్రీడా విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఈ నగరంలో ఏర్పాటు చేస్తారు. ఎలక్ట్రానిక్‌ నగరం-అన్ని రకాల సాఫ్ట్‌ వేర్‌, హార్డ్‌ వేర్‌ ఉత్పత్తుల తయారీకి అనువైన వేదికను సృష్టిస్తున్నారు. న్యాయ నగరం- దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని రకాల న్యాయ సేవలు ఒకే చోట అందుబాటులో ఉండేలా దీనికి ప్రణాళిక చేస్తున్నారు. ఆర్ధిక నగరం- బ్యాంకింగ్‌ వ్యవస్థ మొత్తం ఇక్కడ కేంద్రీకృతమవుతుంది.RBI రీజనల్‌ ఆఫీస్‌, ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు, ఆడిటింగ్‌, మ్యూచ్యువల్‌ ఫండ్స్‌ నిర్వహణ, భీమా సంస్థలు అన్ని ఇక్కడ నెలకొల్పబడతాయి. ఆరోగ్య నగరం- అంతర్జాతీయ హాస్పిటల్స్‌, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు, వైద్య విద్యా సంస్థలు, నర్సింగ్‌ కాలేజీలు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ఇక్కడ ఏర్పాటు అవుతాయి. పర్యాటక నగరం- ఐకానిక్‌ టవర్లు, అమరావతి గేట్‌ వే వంతెనలు వంటి కట్టడాలతో ఈ నగరాన్ని ఆకర్షణీయంగా తయారు చేస్తారు. కృష్ణా నదీ అభిముఖాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతారు. 5 స్టార్‌ హోటల్స్‌, రిసార్ట్స్‌, ఎంటర్‌ టైన్‌మెంట్‌ కేంద్రాలు, పార్కులతో పర్యాటక నగరంగా అభివృద్ధి చేస్తారు. ఈ విధంగా అమరావతి రాజధానిని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారు.

\r\n

Posted Date: 19-10-2015