https://terrafortune.com:443/news-detail/Gannavaram-to-be-gateway-Andhra-Pradesh-new-capital-Amaravathi/36 Gannavaram to be gateway Andhra Pradesh new capital Amaravathi - Terrafortune.com Gannavaram to be gateway Andhra Pradesh new capital Amaravathi - Terrafortune.com

Gannavaram to be gateway Andhra Pradesh new capital Amaravathi

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని నగరానికి గన్నవరం ముఖద్వారం కాబోతుంది. అమరావతికి గేట్‌వేగా CRDA   పరిధిలోని గన్నవరం ప్రాంతాన్ని ఎంపిక చేశారు.గన్నవరంలో విమానాశ్రయం ఉండటం వలన దీనికి అభిముఖంగా రాజధాని ప్రవేశ ద్వారం నిర్మించాలని నిర్ణయించారు.ఎయిర్‌ పోర్ట్‌ నుండి బయటకు రాగానే రాజధాని నగరం అద్భుతంగా ఉందనిపించేలా ఈ గేట్‌వేను నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలోని అత్యద్భుత ఆర్కిటెక్ట్‌ నైపుణ్యంతో గ్రాండ్‌గా ఎంట్రన్స్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. సీడ్‌ కాపిటల్‌ ప్రణాళికలో సింగపూర్‌ ప్రభుత్వ సంస్థలు ఈ గేట్‌వే, రహదారి మధ్యలో ఐకానిక్‌ బ్రిడ్జ్‌ నమూనాలను ప్రతిపాదించాయి. సీడ్‌ కాపిటల్‌ ప్రణాళిక ప్రకారం కృష్ణా నదిపై 3 బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉంది. మొదటిగా విజయవాడ వైపు నుండి రాజధానిలోకి ప్రవేశించే చోట ఐకానిక్‌ బ్రిడ్జ్‌ నిర్మించాలని భావిస్తున్నారు. ఐకానిక్‌ బ్రిడ్జ్‌ నుంచి అమరావతి నగరంలోకి ప్రవేశించే చోట మరొక గేట్‌వేను నిర్మిస్తారు.రాజధాని ప్రాంతంలో 3 రింగు రోడ్లను కూడా ప్రతిపాదించారు. ఎయిర్‌ పోర్ట్‌ నుంచి గన్నవరం గేట్‌వే వరకు 6 వరుసల రోడ్డు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. త్వరలోనే సర్వే చేసి నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉంది. ఎయిర్‌ పోర్ట్‌ ఎదుట వెటర్నరీ కళాశాల ఉన్నందున దీని ప్రక్కన కానీ, లేదా దీనిని వేరొక ప్రదేశానికి తరలించి అయినా సరే విమానాశ్రయానికి అభిముఖంగా గేట్‌వే నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడి నుంచి అమరావతి రాజధానికి, ముఖ్యంగా సీడ్‌ కాపిటల్‌కు చాలా త్వరగా చేరుకునే అవకాశం ఉంది.

\r\n

Posted Date: 01-08-2015