https://terrafortune.com:443/news-detail/Germanys-Linde-Group-to-invest-200-Million-Dollars-(1300-Crores)-in-Andhra-Pradesh/49 Germanys Linde Group to invest 200 Million Dollars (1300 Crores) in Andhra Pradesh - Terrafortune.com Germanys Linde Group to invest 200 Million Dollars (1300 Crores) in Andhra Pradesh - Terrafortune.com

Germanys Linde Group to invest 200 Million Dollars (1300 Crores) in Andhra Pradesh

ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో జర్మనీకి చెందిన లిండే గ్రూప్‌ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. లిండే గ్రూప్‌ ఆంధ్రప్రదేశ్‌ లో సముద్ర ఆహార ఉత్పత్తుల శీతలీకరణలో 200 మిలియన్‌ డాలర్ల (1300 కోట్లు) పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపింది. ఆహార శుద్ధి, గ్యాస్‌, పెట్రోకెమికల్‌ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయటానికి ముందుకొచ్చింది. ఇప్పటికే ఈ సంస్థ గుజరాత్‌ లో కంపెనీని ప్రారంభించింది ఆంద్రప్రదేశ్‌ లో కూడా తమ సంస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంది. AP లో పొడవైన తీరప్రాంతం ఉండటం వలన సముద్ర ఆహార ఉత్పత్తి విస్తృతంగా ఉంది. ఈ సంస్థ సుమారు 200 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఆహార శుద్ధి రంగంలో శిక్షణ ఇవ్వడానికి ఒక అకాడమీ ఏర్పాటు చేయడానికి కూడా ఆసక్తి చూపుతుంది. మొదట సముద్ర ఆహార ఉత్పత్తుల శీతలీకరణ ప్రారంభించి తరువాత పండ్ల రంగంలోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో భవిష్యత్తులో రాబోయే 13 ఆహార శుద్ధి పార్కుల్లో శీతల గిడ్డంగుల ఏర్పాటుకు AP ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చంద్రబాబు వారిని కోరారు. ఈ సమావేశంలో CMO ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రమేష్, మౌలిక వసతుల శాఖ కార్యదర్శి అజయ్‌ జైన్‌ పాల్గొన్నారు.

\r\n

Posted Date: 24-08-2015