https://terrafortune.com:443/news-detail/Grand-arrangements-for-Amaravathi-stone-laying-ceremony/74 Grand arrangements for Amaravathi stone laying ceremony - Terrafortune.com Grand arrangements for Amaravathi stone laying ceremony - Terrafortune.com

Grand arrangements for Amaravathi stone laying ceremony

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుటకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి ప్రజలు కాగడాలతో వెలుగుతున్న జ్యోతిని శంకుస్థాపన ప్రాంతానికి తీసుకువచ్చే విధంగా కార్యాచరణ జరుగుతుంది. అన్ని గ్రామాల నుంచి మట్టి, నీరు సేకరించనున్నారు. భూములిచ్చిన 23 వేల మంది రైతులకు వస్త్రాలతో పాటు ఆహ్వాన పత్రికలు అంది స్తున్నారు. ఈ బాధ్యతను గుంటూరు జిల్లా కలెక్టర్‌ కు అప్పగించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి మోదీ తో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహానిస్తున్నారు. రాజధాని నిర్మాణ ముహూర్తం అక్టోబర్‌ 22వ తేదీ మధ్యాహ్నం 12.35 నిమిషాల నుండి 12.45 నిమిషాల వరకు ఉంటుందని పండితులు చెప్పారు. ఉదయం 9 గంటల నుండి గణపతి హోమం, వాస్తు హోమం వంటి సాంప్రదాయ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మొదట జాతీయ గీతం ఆలాపిస్తారు, షార్ట్‌ ఫిల్మ్, బ్లూ, గ్రీన్‌, యెల్లో బెలూన్‌ లు ఎగరవేయడం, అమరావతి మీడియా ప్రెజెంటేషన్‌, రైతు వందనం సాంగ్‌, అతిధుల ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అమరావతి సాంగ్‌ కార్యక్రమాలకు షెడ్యూల్‌ నిర్ణయించారు. అమరావతి మన మట్టి-మన నీరు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 16,000 గ్రామాల నుండి కిలో మట్టి, లీటరు నీటిని సేకరించి వాటిని శంకుస్థాపన స్థలానికి తీసుకువచ్చి పైలాన్‌ నిర్మాణంలో ఉపయోగించాలని ప్రణాళిక చేస్తున్నారు. రాజధాని శంకుస్థాపన ఉత్సవాలు చరిత్రలో నిలిచిపోయేలా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.VIP లకు, అతిధులకు స్టార్‌ హోటల్స్‌, గెస్ట్‌ హౌస్‌ లు బుక్‌ చేశారు. శంకుస్థాపన జరగబోయే ఉద్దండరాయుని పాలెంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న అతిరధ మహారధులకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

\r\n

Posted Date: 08-10-2015