https://terrafortune.com:443/news-detail/Mobile-companys-huge-investments-in-AndhraPradesh/64 Mobile companys huge investments in AndhraPradesh - Terrafortune.com Mobile companys huge investments in AndhraPradesh - Terrafortune.com

Mobile companys huge investments in AndhraPradesh

నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి అనేక పరిశ్రమలు తరలి వస్తున్నాయి. తాజాగా మూడు ప్రముఖ స్వదేశీ మొబైల్‌ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో 750 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఆ మూడు కంపెనీలు మైక్రోమాక్స్‌, సెల్‌కాన్‌, కార్బన్‌ మొబైల్‌ సంస్థలు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.తిరుపతి పారిశ్రామిక క్లస్టర్‌ రేణిగుంటలో ఈ సంస్థలు తమ యూనిట్‌లను నెలకొల్పనున్నాయి. ఒకే వేదికపై 3 ప్రతిష్టాత్మక కంపెనీలు MOUలు కుదుర్చుకోవడం చాలా గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనలో  APని మరొక సిలికాన్‌ వ్యాలీగా తయారుచేస్తామని తెలిపారు. మైక్రోమాక్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ తయారీలో 10వ స్థానంలో ఉన్న అతి పెద్ద కంపెనీ, ఇది 7 వేల టర్నోవర్‌ తో 565 జిల్లాల్లో దూసుకుపోతుంది. డిల్లీకి చెందిన కార్బన్‌ కంపెనీ 4500 కోట్ల టర్నోవర్‌ తో దేశీయ మొబైల్‌ మార్కెట్‌ లో 8% కలిగి ఉంది. సెల్‌కాన్‌ చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిచే స్థాపించబడింది. ఇది 920 కోట్ల టర్నోవర్‌ కలిగి ఉంది. ఈ కంపెనీలు ప్రారంభిస్తే రాష్ట్రంలో 7 వేల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. APలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్‌ను సాఫ్ట్‌వేర్‌ హబ్‌గా మార్చామని, ఇపుడు నవ్యాంధ్రప్రదేశ్‌ను హార్డ్‌వేర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. హార్డ్‌ వేర్‌ ఉత్పత్తుల తయారీకి కేటాయించడానికి రేణిగుంట ఎయిర్‌ పోర్ట్‌ కార్గ్‌ ఫెసిలిటీకి సమీపంలోని ప్రభుత్వ భూమిని కూడా పరిశీలిస్తున్నారు. మైక్రోమాక్స్‌కు ఇండియాలో ఇది మూడవ యూనిట్‌. ఒకటి ఉత్తరాఖాండ్‌ లో ఉంది మరొకటి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కాబోతుంది. తిరుపతిలో ప్రారంభించబడే యూనిట్‌లో హాండ్‌ సెట్స్‌, టాబ్లెట్స్‌, LED టివిలు మరియు కంప్యూటర్‌ మానిటర్లను ఉత్పత్తి చేయబోతుంది. చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ జియోని రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఇండియాలో సుమారు 330 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ప్రస్థుతం ఆంధ్రప్రదేశ్‌ లోని విశాఖపట్నంలో ఉన్న డిక్సస్‌, ఫాక్స్‌ కాన్‌ తయారీ యూనిట్ల ద్వారా హాండ్‌ సెట్లను ఉత్పత్తి చేయుటకు భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.

\r\n

Posted Date: 18-09-2015