https://terrafortune.com:443/news-detail/Only-special-package,-No-special-status-to-AP/51 Only special package, No special status to AP - Terrafortune.com Only special package, No special status to AP - Terrafortune.com

Only special package, No special status to AP

నవ్యాంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా అంశంపై చర్చించడానికి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాన మంత్రి మోదీ, ఇతర మంత్రులతో భేటీ అయ్యారు. సుమారు 90 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ, సీనియల్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రత్యేక హోదా అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకు బదులుగా కేవలం ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం. కానీ విభజన చట్టంలోని అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని ప్రధాని తెలిపారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నివాసంలో హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్‌ తో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. విభజన సమస్యలపై సుమారు 6 గంటల పాటు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని, ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ ప్రత్యేక ప్యాకేజీ ని ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీ చేయడానికి 2,300 కోట్లు, రాజధాని నిర్మాణానికి 1500 కోట్ల రూపాయలు రిలీజ్‌ చేసిందని తెలిపారు. చంద్రబాబు శాఖల వారీగా రావలసిన నిధుల నివేదికను సమర్పించారు. నవ్యాంధ్రకు 2,25,486 కోట్ల ప్యాకేజీని అమలు చేయాలని చంద్రబాబు ప్రతిపాదనలు సమర్పించారు. రహదారులకు 27,985 కోట్లు, రైల్వేలకు 21,420 కోట్లు, విమానయానానికి 13,714 కోట్లు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదాపై మరొక సారి అధ్యయనం చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

\r\n

Posted Date: 27-08-2015