https://terrafortune.com:443/news-detail/Rajahmundry-to-become-as-Tourist-Hub/33 Rajahmundry to become as Tourist Hub - Terrafortune.com Rajahmundry to become as Tourist Hub - Terrafortune.com

Rajahmundry to become as Tourist Hub

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజమండ్రిని పర్యాటక రారాజుగా తీర్చిదిద్దాలని ప్రత్యేక దృష్టిపెట్టింది.ముఖ్యమంత్రి ప్రత్యేక బోటులో ఇతర మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, నారాయణలతో కలిసి నదీ తీరంలో పర్యటించారు. ఈ సందర్భంగా రాజమండ్రితో పాటు ఉభయ గోదావరి జిల్లాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని పలు అంశాలపై చర్చించారు. రాజమండ్రి ఒక చారిత్రాత్మక నగరమని, సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం రాజరాజ నరేంద్రుని పేరు మీదుగా దీనిని రాజమహేంద్రవరం అని పిలిచేవారని తరువాత బ్రిటీష్ వారు ఆ పేరును రాజమండ్రిగా మార్చారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. తిరిగి రాజమండ్రికి అదే పేరు పెట్టాలని, అఖండ గోదావరి అనే పేరుతో టూరిజం ప్రాజెక్ట్‌ ప్రారంభించి 100 కోట్ల ప్రారంభ వ్యయంతో మొదలుపెట్టి రాజమండ్రిని టూరిస్ట్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. గోదావరి లంకలను అభివృద్ధి చేయడం, నదీ విహారానికి అత్యాధునిక బోట్లు ఏర్పాటు చేయడం, పిచ్చుకలంక-గామన్‌ వంతెన, విజ్జేశ్వరం-గామన్‌ వంతెనల మధ్య ప్రత్యేక ఏర్పాట్లు చేసి రాజమండ్రిని టూరిస్ట్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నారు. గోదావరి తీరంలో భారీ స్థాయిలో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణంపై కూడా చర్చించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో రాజమండ్రి, కోనసీమ, కాకినాడలను కలుపుతూ ప్రత్యేక పాకేజీలు ఏర్పాటు కొరకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. నీటిలో, నేలపై ప్రయాణించే డక్‌ బోటును రాజమండ్రిలో ప్రారంభించేందుకు AP పర్యాటక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. 

\r\n\r\n

 

\r\n

Posted Date: 25-07-2015