https://terrafortune.com:443/news-detail/Real-estate-boom-at-peaks-in-AP-capital-Region-Amaravathi/40 Real estate boom at peaks in AP capital Region Amaravathi - Terrafortune.com Real estate boom at peaks in AP capital Region Amaravathi - Terrafortune.com

Real estate boom at peaks in AP capital Region Amaravathi

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. సీడ్‌ కాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌ విడుదల తరువాత రాజధాని నిర్మాణంపై ఒక స్పష్టత రావటంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రాజధాని సీడ్‌ కాపిటల్‌ పరిధిలో ఉన్న ఉద్దండరాయుని పాలెం, లింగాయపాలెం, తాళ్ళాయపాలెం గ్రామాల పరిధిలోని భూములకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతంలో భూములు కొనడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. రాజధాని ప్రాంతంలో భూముల ధరలు 2014 అక్టోబర్‌ నుండి పెరగడం ప్రారంభించాయి. అంతకుముందు ఎకరం 10-12 లక్షలు లోపు ఉన్న భూముల ధరలు ఒక్కసారిగా 70 లక్షలకు చేరాయి. ఈ తరువాత ఒకటి రెండు నెలలలో ఎకరం 1.50 కోట్ల వరకు కూడా విక్రయాలు జరిగాయి. తరువాత ధరలు క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. గ్రామాన్ని బట్టి ఎకరం 80-90 లక్షల నుండి కోటి, కోటి 15 లక్షల వద్ద స్థిరపడ్డాయి. భూముల క్రయవిక్రయాలు కూడా తగ్గుముఖం పట్టాయి. తాజాగా రాజధాని నిర్మాణం గురించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పరిణామాలు భూముల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. సింగపూర్‌ ప్రభుత్వం సీడ్‌ కాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను అందించడం, అక్టోబర్‌ 22న శంకుస్థాపన జరుగుతుందనే వార్తలతో ధరలు మళ్ళీ పెరిగాయి. ఇప్పుడు ధరలు ఆకర్షణీయంగా ఉండటంతో రైతులు కూడా భూములు విక్రయించడానికి ముందుకొస్తున్నారు. సింగపూర్‌ ప్రభుత్వం మే 25న రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను అందించినపుడు భూముల ధరలపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ జులై 20న సీడ్‌ కాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌ అందించిన తరువాత ధరలు పెరగడం ప్రారంభమయ్యాయి. సీడ్‌ కాపిటల్‌ ప్రాంత పరిధిలో ఉన్న గ్రామాలలో ఎకరం 2 కోట్లకు పైగా పలుకుతుంది. ప్రభుత్వం రాజధానికి భూమిలిచ్చిన రైతులకు వారి గ్రామాలకు దగ్గరలోనే అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తామని తెలపడంతో వాటికి చుట్టుపక్కల గ్రామాలలో కూడా భూముల ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.

\r\n

Posted Date: 07-08-2015