https://terrafortune.com:443/news-detail/Telangana-state-to-have-more-Districts/56 Telangana state to have more Districts - Terrafortune.com Telangana state to have more Districts - Terrafortune.com

Telangana state to have more Districts

హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణా కాబినెట్‌ సమావేశంలో రాష్ట్రంలో మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ నుండి విడిపోయి తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ప్రస్థుతం తెలంగాణాలో రాజధాని నగరం హైదరాబాద్‌తో కలిపి 10 జిల్లాలు ఉన్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చుటలో భాగంగా కాబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీని గురించి సిఫార్సుల కొరకు చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణా జనాభా 3.5 కోట్లు ఉండగా రాష్ట్రం ఏర్పడిన తరువాత జనాభా 4 కోట్లకు పైగా ఉంది. సాధారణంగా వేరే రాష్ట్రాలతో పోల్చితే ప్రతి జిల్లాకు సగటున 19 లక్షల జనాభా ఉందని దీనికి విభిన్నంగా తెలంగాణాలో సగటున జల్లాకు 35 లక్షల జనాభా ఉందని తెలిపారు. ఈ నిష్పత్తిని సవరించేందుకే కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. తెలంగాణాను మొత్తం 23 జిల్లాలుగా విభజించబోతున్నట్లు సమాచారం. మెదక్‌, మహబూబ్‌ నగర్‌, వరంగల్‌ జిల్లాలను మూడు జిల్లాలుగా విభజిస్తున్నారని, మెదక్‌ జిల్లాలో సంగారెడ్డి, సిద్ధిపేట, మహబూబ్‌ నగర్‌ జిల్లాలో వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, వరంగల్‌ జిల్లాలో జనగామ, భూపాల్‌ పల్లి జిల్లాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ను ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్‌, సౌత్‌ జిల్లాలుగా విభజిస్తున్నట్లు తెలిసింది. ఈ విధంగా 10 జిల్లాల తెలంగాణా 23 జిల్లాలుగా ఏర్పాటు కావడంపై తెలంగాణా ప్రజలు ఆనందం వ్యక్తపరుస్తున్నారు.

\r\n

Posted Date: 03-09-2015