https://terrafortune.com:443/news-detail/Vizag,-Amaravathi,-Tirupati-to-be-developed-as-3-mega-cities/77 Vizag, Amaravathi, Tirupati to be developed as 3 mega cities - Terrafortune.com Vizag, Amaravathi, Tirupati to be developed as 3 mega cities - Terrafortune.com

Vizag, Amaravathi, Tirupati to be developed as 3 mega cities

నవ్యాంధ్రప్రదేశ్‌ లో వైజాగ్‌, అమరావతి, తిరుపతి 3 మెగా నగరాలుగా అభివృద్ధి చెందబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీని కొరకు AP అర్బన్‌ మిషన్‌ పేరుతో ఒక కార్యాచరణ పత్రం కూడా తయారుచేసింది. కేవలం మెగాసిటీలను అభివృద్ధి చేయడమే కాకుండా సమీప ప్రాంతాల్లోని పట్టణాలను, నగరాలను కూడా అభివృద్ధి చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆలోచన. దీనిలో భాగంగానే మెగా నగరాల సమీపంలోని మున్సి పాలిటీలను కార్పొరేషన్‌ లుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. కొత్తగా 25 నగర పంచాయితీలను కూడా ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ 3 మెగాసిటీల పరిధిలో 195 పట్టణాలు కూడా అభివృద్ధి చెందనున్నాయి. వైజాగ్‌ మెగాసిటీలో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని కొన్ని పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేస్తారు. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మెగా నగరంలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని కొన్ని పట్టణాలను విలీనం చేస్తారు. ఈ మెగా సిటీ  CRDAతో పాటు 39 పట్టణ స్థానిక సంస్థలను కలిగి ఉంటుంది. తిరుపతి మెగా నగరంలో కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలోని పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేస్తారు. ఈ మెగా సిటీ 45 పట్టణ స్థానిక సంస్థలతో పాటు 21 అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీలను కలిగి ఉంటుంది. ఈ మెగా సిటీల అభివృద్ధి కొరకు కేంద్ర పట్టణాభివృధి శాఖ ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళిక ప్రకారం కార్పొరేషన్‌ లను అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీలుగా, మున్సిపాలిటీలను కార్పొరేషన్‌లుగా, నగర పంచాయితీలను ము న్సిపాలిటీలుగా చేసే ప్రక్రియ చేపట్టనున్నారు. మచిలీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మున్సిపాలిటీలను అప్‌ గ్రేడ్‌ చేసి కార్పొరేషన్‌ లుగా చేస్తారు. నెల్లూరు, గోదావరి, కర్నూలు, అనంతపురం అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీలను ఏర్పాటు చేస్తారు. మెగాసిటీలో మెరుగైన సేవలు అందించుట కొరకు E-గవర్నెన్స్‌ ను అమలు చేస్తున్నారు.E-గవర్నెన్స్‌ ద్వారా 15 రకాల సేవలను అందించబోతున్నారు. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు నగరాలను ప్రధాన పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తారు. సముద్రం, నదులకు సమీపంలో ఉన్న నగరాలకు పర్యాటకాభివృద్ధిలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ విధంగా 3 మెగా సిటీలతో పాటు వాటి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందబోతున్నాయి.

\r\n

Posted Date: 13-11-2015